తెలంగాణకు తరలింపని అధికారులు అనుమానం
బెంగళూరు:బెంగుళూరు సిటీ లో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటలకు దాదాపు 42 కోట్ల రూపాయల నగదును అదాయపు పన్ను అధికారులు సీజ్ చేసారు. 22 బాక్సుల్లో వున్న 42 కోట్ల రూపాయలు సీజ్ అయ్యాయి. కేసు ఐటీ నుండి ఈడీకి మారింది. కాంగ్రేస్ నేత, కర్నాటక కాంట్రాక్టర్ల అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ అంబికాపతికి చెందిన నగదు గా నిర్దారించారు. మొత్తం 50 కోట్లు..ఇప్పటి కే 8 కోట్లు తెలంగాణ కు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. లారీ లో 42 కోట్లు తరలిస్తున్నప్పుడు రైడ్ జరిగింది. తెలంగాణ లో ఓ ప్రముఖ పార్టీ కి 50 కోట్ల రూపాయలు తరలిస్తున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. బెంగుళూరు లోని బైరే సంద్ర ప్రాంతం లోని ఓ అపార్ట్మెంట్ కేంద్రంగా హవాల మనీ తరలింపు జరిగింది. తెలంగాణ ఎన్నికల కోసమేనని ఐటీ అధికారులు అనుమానానిస్తున్నారు.