గత వారంగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో రైతుల సరుకు రాబడులు అడుగంటుతున్నాయి. తద్వారా శీతలగిడ్డంగుల సరుకు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జూలై 1 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 10,33,697 బస్తాల నుండి తగ్గి 9,95,554 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో
చాకూ బెల్లం 5,32,781 నుండి తగ్గి 4, 46,722 బస్తాలు, రసకట్ 44,338 బస్తాల నుండి తగ్గి 36,146, రాబిటన్ 2,35,247 నుండి 2,03,024, ఖురుపా 11,557 నుండి 6571, లడ్డు బెల్లం 1290 నుండి 675 బస్తాలకు పరిమితం కాగా, పాపిడి 1,32,764 నుండి పెరిగి 1,58,216 బస్తాలు, చదరాలు 75,290 నుండి 1,15,504 బస్తాలకు చేరాయి.

ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ శీతలగిడ్డంగుల నుండి గత వారం 250-300 క్వింటాళ్ల బెల్లం రాబడిపై చాకూ బెల్లం రూ. 3950,
చదరాలు రూ. 3775,
రసకట్ రూ. 3000 ప్రతి క్వింటాలు మరియు ఖతౌలిలో లడ్డు బెల్లం 40 కిలోలు రూ. 1300–1310,
శ్యామిలిలో పొడిబెల్లం రూ. 1400,
దిల్లీలో లడ్డు బెల్లం 100 కిలోలు రూ. 4200-4300,
చాకూ బెల్లం దిమ్మలు రూ. 4150-4250, అచ్చులు రూ. 4200-4400 ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని లాతూర్
లో గతవారం 8–10 వేల దిమ్మల బెల్లం రాబడిపై సురభి రకం రూ. 3950-4000, మీడియం రూ. 3750-3800,
యావ రేజ్ రూ. 3600 మరియు సోలాపూర్లో 5-6 వేల దిమ్మలు రూ.3750-4050, ఎరుపు రకం రూ.3650-3700,
సాంగ్లీలో 7-8 వేల దిమ్మల రాకపై సురభి రకం రూ. 3750–3800,
ముంబై రకం రూ. 3800-3900 మరియు పూణెలో నాణ్యమైన సరుకు రూ. 3700, మీడియంరూ. 3500,
సాధారణ రకం రూ.3300,
క్లాసిక్ రూ. 4300-4400 ధరతో వ్యాపార మైంది.

ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 4100-4150,
నలుపు రూ. 4000,
చిత్తూరులో 20-22 వాహనాలసరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ రూ. 5000,
సురభి రకం రూ. 4700,
నలుపు రూ. 4300 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్లో మాండ్యా ప్రాంతం బెల్లం రూ.4600-4800,
చదరాలు రూ. 4800–4900,
సాంగ్లీ సరుకు రూ. 4700-4800,
ఒక కిలో దిమ్మలు 4600-4700,
అర కిలో దిమ్మలు రూ. 4700 – 4800, మహారాష్ట్ర లడ్డు బెల్లం రూ. 4600-4700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో వారంలో 55-60 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ.3500,
సింగిల్ ఫిల్టర్ రూ. 3700,
డబుల్ ఫిల్టర్ రూ.3950,
చదరాలు రూ.4150,
శిమోగాలో 17-18 వాహనాల రాకపై రూ.3950-4000,

మహాలింగాపూర్లో 2-3 వాహనాలు సురభి రకం రూ. 3700–3800,
బాక్స్ రకం రూ.3800-3850,
అరకిలో దిమ్మలు రూ. 3900, 200 గ్రాముల దిమ్మలు రూ. 4000 ధరతో వ్యాపారమైంది.

తమిళనాడులోని సేలం మార్కెట్లో 10 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు రకం ప్రతి 40 కిలోలు తెలుపు రకం రూ.1420-1440,
సురభి రూ. 1400-1420,
ఎరుపు రకం రూ. 1370–1400,

పిలకలపాలయంలో 9-10 వేల బస్తాల రాకపై తెలుపు రకం రూ. 1260 – 1280,
సురభి రకం రూ. 1240 – 1260,
ఎరుపు రకం రూ. 1230 -1240,
చిత్తోడ్లో 7 వేల బస్తాల రాకపై తెలుపు రకం రూ. 1360 -1380,
సురభి రకం రూ.1340–1360,
ఎరుపు రకం రూ.1300-1320,
చదరాలు రూ.1380-1410
మరియు 3 వేల బస్తాల పొడి బెల్లం రాబడిపై రూ. 1300-1320,

కౌందప్పాడిలో 4 వేల బస్తాల రాకపై పొడి బెల్లం రూ. 1300-1330 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *