ప్రభుత్వానికి హడ్కో (హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో ఓకే చెప్పింది. గత వారంలో రెండు రోజుల పాటు హడ్కో ప్రతినిధులు టిడ్కో అధికారులతో సమావేశం అయ్యారు. రుణాలకు సంబంధించి హామీనిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు టిడ్కో ఇళ్లు ఎంత వరకు పూర్తయ్యాయి?.. ఏ దశల్లో ఉన్నాయి? అని నివేదిక రూపొందించారు.ఈ పెండింగ్ టిడ్కో ఇళ్లు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని హడ్కో అధికారులు కోరారు. ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా.. మరో రెండు రోజుల్లో నివేదికను హడ్కోకు అందించ బోతున్నారు. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 3.14 లక్షల గృహాలను చేపట్టింది.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. 2019లో 52 వేల టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. వీటిలో 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పగా.. ఎన్నికల సమయానికి 1.45 లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది.అయితే వీటిలో ఎక్కువ ఇళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతంపైగా పూర్తి చేసినవే ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన 1.17 లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా.. దీని కోసం రూ.5,070 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.