తిరుపతి జిల్లా: ఇబ్బందికర సమయంలో ఒక ఆశా కిరణం దిక్సూచి లాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసి జిల్లాకు మంచి పేరును తీసుకొచ్చిన గొప్ప అధికారి ఈరోజు బదిలీపై కడప జిల్లాకు వెళ్లడం చాలా బాధాకరమని జిల్లా పోలీసులు భావోద్వేగము అయ్యారు. బదిలీపై కడప జిల్లాకు వెళ్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., గారిని ఆదివారం నాడు సాయంత్రం స్థానిక పోలీస్ అతిథిగృహం సమావేశ మందిరం నందు జిల్లా పోలీసులు గజమాలలతో దుశ్యాలువులతో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., గారు మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినాటి నుండి హోంగార్డు స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.తన దృష్టిలో హోంగార్డ్ నుండి ఉన్నతాధికారి వరకు అందరూ సమానమే. వారి వారికి సమూచిత స్థానాన్ని ఇచ్చి గౌరవించాలి . ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడి వారికి చేయవలసిన పని గురించి వివరించి మంచిగా పని చేయించుకుని మెరుగైన ఫలితాలను పొందాలని పోలీస్ అధికారులు ఉద్దేశించి తెలిపారు.ఈ రెండు నెలల వ్యవధిలో తిరుపతి జిల్లాను చక్కబెట్టాను అనే సంతృప్తితో బదిలీ అవుతున్నాను. తాను బదిలీపై వెళ్ళిన తర్వాత కూడా తాను నమ్మే బేసిక్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తారని జిల్లా ఎస్పీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.పోలీసులు సరిగా పనిచేయకపోతే సమాజం దెబ్బతింటుంది ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమ విధులను నిక్కచ్చిగా హుందాగా నిర్వర్తించాలని అధికారులను సూచించారు.భారత ఎన్నికల సంఘం వారు తిరుపతి జిల్లా ఎస్పీ గా శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారిని నియమించారు ఆయన బాధ్యతలు స్వీకరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమర్థవంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. ఇలాంటి ఉత్తమమైన అధికారి వద్ద మేము దాదాపు రెండు నెలలపాటు పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని అదనపు ఎస్పి పరిపాలన శ్రీ వెంకట రావు గారు అన్నారు.తిరుపతి జిల్లా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ఆశా కిరణం దిక్సూచి లాగా తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడారు. ప్రతి విషయంపై సమగ్రమైన పరిజ్ఞానం కలిగి ఉండి తాను పనిచేస్తూ, అందరి దగ్గర పని చేపించారు. ప్రజలకు మంచి సేవలు అందించి పోలీస్ శాఖకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి జిల్లా ఎస్పీ గారు పరితపిస్తుంటారు అని అదనపు ఎస్పీ క్రైమ్ శ్రీమతి విమల కుమారి మేడం గారు అన్నారు.జిల్లాలో బేసిక్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేశారు. బిట్స్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ సైబర్ క్రైమ్ ఎస్బిఐ క్రైమ్ వంటి ప్రతి ఒక్క విభాగంతో మమేకమై వారి పనితీరును సమీక్షించి తగిన మెలకువలను చెప్పి వారి వద్ద నుండి మంచి ఫలితాలను రాబట్టిన మంచి అధికారి తిరుపతి జిల్లా నుండి బదిలీపై వెళ్లడం చాలా బాధాకరమని అదనపు ఎస్పీ శాంతి భద్రతలు శ్రీ కులశేఖర్ గారు జిల్లా ఎస్పీ గారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకట్రావు పరిపాలన, శ్రీ కులశేఖర్ శాంతిభద్రతలు, శ్రీమతి విమల కుమారి నేర విభాగం, జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు పాల్గొని జిల్లా ఎస్పీ గారిని గజమాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *