పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి హతం
పాకిస్థాన్ లో లతీఫ్ ను కాల్చిచంపిన దుండగులు
న్యూఢల్లీి: 2016 లో జరిగిన పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్థావరం పై ఉగ్రదాడి సూత్రధారి, కీలక సమన్వయకర్త షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. పాకిస్థాన్ లో లతీఫ్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.సియాల్ కోట్ లో ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు లతీఫ్ పైవిచక్షణరహితంగా కాల్పులక తెగబడ్డారు.
పఠాన్ కోట్ ఉగ్రదాడి 17గంటలపాటు కొనసాగింది. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులుజరిగాయి. ఐదు మంది ఉగ్రవాదులు. తొమ్మిదిమంది సైనికులు మృతి చెందారు.
41 ఏళ్ల లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్`ఎ`మహ్మద్ (జేఎం) సభ్యుడు. జనవరి 2, 2016న జరిగిన పటాన్కోట్ దాడికి ప్రధాన కుట్రదారుడిగా భారత భద్రతాదళాలు గుర్తించాయి. అతను సియాల్కోట్ నుంచే దాడికి వ్యూహ రచన చేశాడు. దానిని అమలు చేయడానికి నలుగురు జెఎమ్ ఉగ్రవాదులను పఠాన్కోట్కు పంపాడు. అంతకుముందు 1994 నవంబర్ లో తీవ్రవాద ఆరోపణలపై భారత దేశంలో అరెస్టు అయ్యాడు. జైలు శిక్ష అనుభవించిన తరువాత 2010 లో వాఘా సరిహద్దు విూదుగా పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు. లతీఫ్ పై 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన కేసు కుడా నమోదయింది. అతడిని భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టుగా పేర్కొంది.