అన్నమయ్య జిల్లా: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ. వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ. వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ సమస్యలు విన్నవించుకున్న 75 మంది ఫిర్యాదుదారులు. ఫిర్యాదులను చట్ట పరిధిలో విచారించి త్వరితగతన పరిష్కరిస్తాం: జిల్లా ఎస్పీ శ్రీ. వి. విద్యాసాగర్ నాయుడు జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదిదారులు వారి సమస్యలను విని అర్జీలను పరిశీలించి, చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ. వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ప్రజలు నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖా ముఖి మాట్లాడి, ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు.