న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 17:ఢల్లీికి మరోసారి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంతో ఆయన స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రి అతీషికి సీఎం పదవిని అప్పగించాలని నిర్ణయించింది. సమావేశంలో అతిషి పేరును అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ప్రతిపాదనను ఆమోదించారు. ఢల్లీికి మూడో మహిళా ముఖ్యమంత్రి అతిషి. ఇంతకు ముందు సుష్మా స్వరాజ్‌, షీలా దీక్షిత్‌ ఢల్లీి సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.ఢల్లీి ఎక్సైజ్‌ పాలసీలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాలను అరెస్టు చేసిన తర్వాత అతిషి వార్తల్లో నిలిచారు. మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ రాజీనామా చేసిన తర్వాత, అరవింద్‌ కేజ్రీవాల్‌ 9 మార్చి 2023న అతిషి, సౌరభ్‌ భరద్వాజ్‌లను కేబినెట్‌ మంత్రులుగా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అతిషి విద్య, నీరు, ఆర్థిక, ఖచిఆ, విద్యుత్‌తో సహా మొత్తం 14 మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇన్ని శాఖల బాధ్యత కలిగిన ఏకైక మంత్రి అతిషి కావడం విశేషం.అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటన తర్వాత, అతిషి పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉంది. అరవింద్‌ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకమైన మంత్రుల్లో అతిషి ఒకరిగా భావిస్తారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైల్లో ఉండగా ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే అవకాశం వచ్చింది. జైలు నుంచి ఢల్లీి ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ తన తరపున అతిషి పేరును పంపించడం ఇదే కారణం. .ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఉన్న నమ్మకం, సాన్నిహిత్యం కాకుండా, అనేక ఇతర అంశాలు అతిషిని కలిసి వచ్చిన అంశాలు. అతిషి ఢల్లీి ప్రభుత్వంలో మహిళా మంత్రి మాత్రమే కాదు, ప్రస్తుతం ఆమె ఢల్లీి ప్రభుత్వంలో గరిష్ట సంఖ్యలో శాఖలలో 14 శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విద్యా శాఖ, ఖచిఆ, నీటి శాఖ, రెవెన్యూ, ప్లానింగ్‌, ఫైనాన్స్‌ వంటి ముఖ్యమైన శాఖలను కేజ్రీవాల్‌ అప్పజెప్పారుఅతిషి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన సమయంలోనే పార్టీలో చేరారు. 2013 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె ముఖ్యమైన సభ్యురాలు. పార్టీ ఏర్పాటులో, పార్టీ విధానాలను నిర్ణయించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అనంతరం ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధిగా సమస్యలను వివరించే బాధ్యతను అతిషి స్వీకరించారు. అతిషి అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సలహాదారుగా కూడా పనిచేశారు. సిసోడియా జైలుకు వెళ్ళిన తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు.ఢల్లీి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ విజయ్‌ కుమార్‌ సింగ్‌, త్రిప్తా వాహీ దంపతులకు అతిషి జన్మించారు. అతిషి తన పాఠశాల విద్యను న్యూ ఢల్లీిలోని స్ప్రింగ్‌డేల్‌ స్కూల్‌లో చేశారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో చరిత్రను అభ్యసించారు. చెవెనింగ్‌ స్కాలర్‌షిప్‌పై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. కొన్ని సంవత్సరాల తరువాత, విద్యా పరిశోధనలో రోడ్స్‌ స్కాలర్‌గా ఆక్స్‌ఫర్డ్‌ నుండి తన రెండవ మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. అతిషి మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో 7 సంవత్సరాలు గడిపారు. అక్కడ ఆమె సేంద్రీయ వ్యవసాయం, ప్రగతిశీల విద్యా వ్యవస్థలలో పాలుపంచుకున్నారు. అనేక ఔఉూలతో కూడా కలిసి పని చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *