రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి ఇస్రో స్వీయ శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలి
తమిళనాడులో ఏర్పాటు చేయనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండో స్పేస్‌పోర్ట్‌ (అంతరిక్ష పరిశోధన కేంద్రం) నుండి ఇస్రో శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలని, ప్రయివేటీకరణను ఆపాలని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఆర్గనైజేషన్స్‌ కాన్ఫెడరేషన్‌ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ అధ్యక్షులు వి.కృష్ణ మోహన్‌ విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) స్పేస్‌పోర్ట్‌ నుంచి ఇస్రో స్వీయ వ్యోమ నౌకలను పంపడంతో పాటు ప్రయివేటు వ్యోమనౌకలను, కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్న విధంగా తూత్తుకుడి జిల్లాలోని కులశేఖరపట్టణంలో నిర్మించే రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి కూడా
ఇస్రో స్వీయ శాటిలైట్లను ప్రయోగించడానికి అనుమతించాలని కోరారు. అయితే ఇక్కడ నిర్మించే స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వి)ను ప్రైవేట్‌ రంగం మాత్రమే వినియోగిస్తుందని, ఇస్రో రాకెట్లు ప్రయోగించబోరనే నిర్ణయాన్ని తప్పుబట్టారు.సుమారు రెండేళ్లలో అందుబాటులోకి రానున్న స్పేస్‌పోర్టు కోసం అవసరమైన రెండు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఇస్రోకు అప్పగించినట్లు, ఇక నుంచి ప్రయివేటు రంగానికి సంబంధించిన వ్యోమనౌకలను, ఉపగ్రహాలను మాత్రమే
కులశేఖరపట్టణంలో నిర్మించే స్పేస్‌పోర్టు నుంచి పంపించనున్నారని వి. కృష్ణ మోహన్‌ తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని, ప్రయివేటు రంగ శాటిలైట్లను మాత్రమే నింగిలోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రయోగ కేంద్రాన్ని వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌`స్పేస్‌) చైర్మన్‌ను కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *