`నీలాపనిందలు పోగొట్టే వినాయక వ్రతకథ

ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ గణేశుడికే వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక వ్రతం, పూజా విధానం ఎలా చేయాలో మంథని పట్టణానికి చెందిన పురోహితుడు మత్స్య శివప్రసాద్‌ తెలిపారు తెలుసుకోండి. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించారు. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత..‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతిసానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’శ్లోకం: య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.పూజకు కావాల్సిన సామాగ్రిపసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.పూజా విధానం..ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరంఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమఃఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి.ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సితారామాభ్యాం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తభూతోచ్చాటనఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే అనే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకొవాలి.ప్రాణాయామం: ఓం భూః, ఓం భువః, ఓగ్‌ సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓగ్‌ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌, ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‌అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి. సంకల్పం:మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, ??.. నదీ సవిూపే??? ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ వికారినామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, (భాద్రపద) మాసే, (శుక్ల) పక్షే, (చతుర్థ్యాం) తిథి ఇందు వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్‌???? గోత్ర: ???.నామధేయ (వారివారి గోత్రం, పేరు చదువుకోవాలి) ధర్మపత్నీ?????? సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్‌ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజేఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్‌ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‌ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్ననాయకం.షోడశోపచార పూజధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామిఅత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ.. ఆవాహయామి:మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం.. ఆసనం సమర్పయామి:గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం.. ఆర్ఘ్యం సమర్పయామి:గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.. పాద్యం సమర్పయామి:అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో.. ఆచమనీయం సమర్పయామి: దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే.. మధుపర్కం సమర్పయామి:స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత.. పంచామృత స్నానం సమర్పయామి:గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే.. శుద్దోదక స్నానం సమర్పయామి: రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ..వస్త్రయుగ్మం సమర్పయామి:రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక.. యజ్ఞోపవీతం సమర్పయామి:చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం.. గంధాన్‌ సమర్పయామి:అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాంస్తండులాన్‌ శుభాన్‌, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే.. అక్షతాన్‌ సమర్పయామి:సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.. పుష్పాణి పూజయామి:అథాంగ పూజ.. పుష్పాలతో పూజించాలి.గణేశాయ నమః ` పాదౌ పూజయామిఏకదంతాయ నమః ` గుల్ఫౌ పూజయామిశూర్పకర్ణాయ నమః ` జానునీ పూజయామివిఘ్నరాజాయ నమః ` జంఘే పూజయామిఅఖువాహనాయ నమః ` ఊరూ పూజయామిహేరంబాయ నమః ` కటిం పూజయామిలంబోదరాయ నమః ` ఉదరం పూజయామిగణనాథాయ నమః ` నాభిం పూజయామిగణేశాయ నమః ` హృదయం పూజయామిస్థూలకంఠాయ నమః ` కంఠం పూజయామిగజవక్త్రాయ నమః ` వక్త్రం పూజయామివిఘ్నహంత్రే నమః ` నేత్రం పూజయామిశూర్పకర్ణాయ నమః ` కర్ణౌ పూజయామిఫాలచంద్రాయ నమః ` లలాటం పూజయామిసర్వేశ్వరాయ నమః ` శిరః పూజయామివిఘ్నరాజాయ నమః ` సర్వాణ్యంగాని పూజయామిఏకవింశతి పత్రపూజఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి. సుముఖాయనమః ` మాచీపత్రం పూజయామి,గణాధిపాయ నమః ` బృహతీపత్రం పూజయామి?ఉమాపుత్రాయ నమః ` బిల్వపత్రం పూజయామి,గజాననాయ నమః ` దుర్వాయుగ్మం పూజయామిహరసూనవేనమః ` దత్తూరపత్రం పూజయామి,లంబోదరాయనమః ` బదరీపత్రం పూజయామి,గుహాగ్రజాయనమః ` అపామార్గపత్రం పూజయామి,గజకర్ణాయనమః ` తులసీపత్రం పూజయామి,ఏకదంతాయ నమః ` చూతపత్రం పూజయామి,వికటాయ నమః ` కరవీరపత్రం పూజయామి,భిన్నదంతాయ నమః ` విష్ణుక్రాంతపత్రం పూజయామి,వటవేనమః ` దాడివిూపత్రం పూజయామి,సర్వేశ్వరాయనమః ` దేవదారుపత్రం పూజయామి,ఫాలచంద్రాయ నమః ` మరువకపత్రం పూజయామి,హేరంబాయనమః ` సింధువారపత్రం పూజయామిశూర్పకర్ణాయనమః ` జాజీపత్రం పూజయామి,సురాగ్రజాయనమః ` గండకీపత్రం పూజయామి,ఇభవక్త్రాయనమః ` శవిూపత్రం పూజయామి,వినాయకాయ నమః ` అశ్వత్థపత్రం పూజయామి,సురసేవితాయ నమః ` అర్జునపత్రం పూజయామి,కపిలాయ నమః ` అర్కపత్రం పూజయామి,శ్రీ గణేశ్వరాయనమః ` ఏకవింశతి పత్రాణి పూజయామి.అష్టోత్తర శతనామ పూజావళిఓం గజాననాయ నమఃఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం?

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *