పొలిటికల్‌ సెన్సేషన్‌. ఫైర్‌ బ్రాండ్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్‌. అతని ప్రతి మాట ఇప్పుడో పెద్ద సంచలనం. తానిచ్చే ప్రతి స్టేట్‌మెంట్‌ చర్చనీయాంశమే. గడ్డుకాలం అయిపోయింది. సీన్‌ మారింది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ మాట్లాడే ప్రతీమాటకు బీజేపీ ఆలోచించి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు రాహుల్‌ ఏ కామెంట్‌ చేసినా లైట్‌ తీసుకున్న కమలనాథులు ఇప్పుడు ప్రతీ చిన్న మాటకు కౌంటర్‌ ఇవ్వడం లేకపోతే సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. అంతలా కమలం పార్టీ కళ్లలో నలుసులా మారారు రాహుల్‌ గాంధీ.అమెరికా పర్యటనలో రాహుల్‌ చేసిన కామెంట్స్‌ దుమారం లేపుతున్నాయి. మోదీ, ఖీూూ టార్గెట్‌గా విమర్శల దాడి పెంచుతున్నారు. మోదీ అంటే విద్వేషం లేదంటూనే మాటల బాణాలు ఎక్కుపెడుతున్నారు. యూఎస్‌ టూర్‌లో రాహుల్‌ చేస్తున్న వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతున్నాయి. సిక్కులు భారతదేశంలో తలపాగా పెట్టుకోవడానికి, గురుద్వారాకు వెళ్లడానికి అనుమతించబోతున్నారా లేదా అనేదానిపై పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం సిక్కులకే కాదు, అన్ని మతాలకు సంబంధించిన విషయమంటూ కామెంట్‌ చేశారు రాహుల్‌.2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీఎం మోదీ పట్ల ఉన్న భయం పోయిందంటున్నారు రాహుల్‌. ఎన్నికల తర్వాత ఏదో మార్పు వచ్చిందని.. అంతకముందు ప్రధాని మోదీ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. వివిధ ఏజెన్సీలు, విూడియా, ఐటీ చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో కూడా భయాన్ని కల్పించే ప్రయత్నం జరిగిందన్నారు. కానీ అవేవిూ పని చేయలేదని.. అందరిలో భయం మాయమైందంటున్నారు. మోదీ ప్రభావం తగ్గిపోయిందని.. 56 ఇంచుల ఛాతీ, దేవుడితో ప్రత్యక్ష సంబంధం అంతా పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్‌ గాంధీ.రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్‌గా రియాక్ట్‌ అవుతోంది. విదేశీ గడ్డపై భారత్‌ పరువు తీసేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని.. సిక్కుల ఊచకోతకు ఎవరు కారణమో రాహుల్‌ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నిస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్‌ బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు కమలనాథులు.సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై కూడా విమర్శలు చేశారు రాహుల్‌. ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు తాను భావించట్లేదని.. ఫేర్‌ ఎలక్షన్‌ జరిగితే బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చేవి కావంటున్నారు రాహుల్‌. ఆర్థిక అండతో పాటు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఏం కావాలో అదే చేసిందని.. తమ బ్యాంకు అకౌంట్లను సీజ్‌ చేసి ప్రచారంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారన్నారు రాహుల్‌. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయమేననే చర్చకు తావిచ్చినట్టయింది. రిజర్వేషన్ల కొనసాగింపుపై తన విధానపరమైన నిర్ణయం ఏమిటో రాహుల్‌ గా?ంధీ చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇది` దేశ సామాజిక సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుందని, రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్న వారి విస్తృత ప్రయోజనాలకు విఘాతంలా పరిణమిస్తుందనే ఆందోళనలకు తెర తీసినట్టయింది. జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు దీనిపై స్పందించాయి. రాహుల్‌ వ్యాఖ్యలను తప్పుపట్టాయి. నిజానికి` రిజర్వేషన్లతో కాంగ్రెస్‌ పార్టీకి సంక్లిష్టమైన సంబంధం ఉంది. రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో తరచుగా అట్టడుగు వర్గాల ఛాంపియన్‌గా నిలుస్తుంటుంది. చరిత్రను నిశితంగా పరిశీలించగలిగితే మాత్రం కొన్ని లోపాలు ప్రస్ఫూటంగా కనిపిస్తాయనడంలో సందేహాలు అక్కర్లేదు. వైసీపీలో యాంకర్‌ శ్యామలకు కీలక పదవి: రోజాతో సమాన హోదా రిజర్వేషన్ల విషయంలో పార్టీ వ్యవస్థాపకుడు, తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ విస్తృతమైన ప్రయోజనాలను అమలు చేయడానికి వెనుకాడారు. అనంతరం ఇందిరా గాంధీ పదవీకాలం కూడా కీలకమైన రిజర్వేషన్ల విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే అభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ప్రధాని, రాహుల్‌ గాంధీ తండ్రి రాజీవ్‌ గాంధీ ఓబీసీలను మూర్ఖులుగా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన రాహుల్‌.. ఔఖీఎల విూటింగ్‌లో బీజేపీ తీరుపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతోన్న రాహుల్‌ గ్రాఫ్‌.. ఔఖీఎల్లో వస్తున్న స్పందన చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. రాహుల్‌ ప్రతి మాటలో నిజం ఉందని.. బీజేపీ వ్యవస్థలను నాశనం చేసిందని.. దేశాన్ని ఆగం పట్టించిందని ఘాటుకు కౌంటర్‌ ఇస్తోంది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ యూఎస్‌ టూర్‌లో చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌గా డైలాగ్‌వార్‌కు తెరదీశాయి. ఇది ఎటు టర్న్‌ తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.అమెరికా పర్యటనలోఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్‌ దేశంలో రిజర్వేషన్ల విషయంతో పాటు పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. విదేశాల్లో భారత్‌ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో భారత దేశాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌ వ్యాఖ్యలపై అమిత్‌ షా స్పందించారు.. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విఛ్చిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్‌ గాంధీకి ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను.. బీజేపీ ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అదేవిధంగా దేశ భద్రతతో ఆటలాడలేరని అమిత్‌ షా అన్నారు. రాహుల్‌ గాంధీ ప్రతీసారి దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అమిత్‌ షా అన్నారు. ప్రాంతీయ వాదం, మతం, భాష పరంగా చీలకలు తెచ్చే కాంగ్రెస్‌ రాజకీయాలను రాహుల్‌ ప్రకటన బయటపెట్టిందని అమిత్‌ షా అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *