ఐదేళ్లపాటు పలు రకాల పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు
హావిూ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం
కొనుగోళ్లపై ఎలాంటి పరిమితి ఉండదు..దీని కోసం ఒక పోర్టల్‌ కూడా అభివృద్ధి చేస్తాం
వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌ వెల్లడి
ఢల్లీి శివారులో రైతులు చేపట్టిన ఆందోళనలు సత్ఫలితాలు
న్యూఢల్లీి ఫిబ్రవరి 19:తమ డిమాండ్ల సాధనకు ఢల్లీి శివారులో రైతులు చేపట్టిన ఆందోళనలు సత్ఫలితాలనిస్తున్నాయి. రైతులు డిమాండ్లలో ఒకటైన కనీస మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ఐదేళ్లపాటు పలు రకాల పంటలను కనీస మద్దతు ధర(ఓూఖ)కు కొనుగోలు చేస్తామని కేంద్రం హావిూ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడిరచారు. ఢల్లీి చలో పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం జరిపిన నాలుగో విడత చర్చలు ముగిశాయి. ఆదివారం రాత్రి రైతు నేతలతో కేంద్రం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ చర్చలు జరిపారు. రైతులు, కేంద్రం మధ్య జరిగిన ఈ చర్చల్లో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 8.15 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు వరకు ముగిశాయి.సమావేశం అనంతరం పీయూష్‌ గోయెల్‌ మాట్లాడుతూ.. ‘‘రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజేన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని మా బృందం ప్రకటించింది. మినుములు, మైసూర్‌ పప్పు, కందులు, మొక్కజొన్న పండిరచే రైతులతో ఎన్‌సీపీఎఫ్‌, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. కొనుగోళ్లపై ఎలాంటి పరిమితి ఉండదు. దీని కోసం ఒక పోర్టల్‌ కూడా అభివృద్ధి చేస్తాం. దీంతో పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయి. సాగు భూములు సిస్సారంగా మారకుండా ఉంటాయి.’’ అని తెలిపారు. ఇక ప్రభుత్వ ప్రాతిపాతనపై నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత తమ భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ తెలిపారు. మరో రెండు రోజుల్లో తమ ఇతర డిమాండ్లు కూడా పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా కనీస మద్దతు ధరతోపాటు రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్‌ ఇవ్వాలని, నిరసనల సందర్భంగా వారిపై పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి కేంద్రం కనీస మద్దతు ధరకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మిగతావాటి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రస్తుతానికి రైతులు తమ ఆందోళనను విరమించనున్నారు. అయితే తమ డిమాండ్లన్నీ నెరవేర్చకుంటే ఫిబ్రవరి 21న పాదయాత్రను పునఃప్రారంభిస్తామని రైతులు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *