న్యూఢల్లీి, ఫిబ్రవరి 19: వైసీపీ నేతల ఓటర్ల ప్రలోభ పర్వంపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాన్‌ గుర్తుతో ఓటర్లకు కుక్కర్లు, ప్లాస్క్‌లతో పాటు గిప్ట్‌లను అందజేస్తున్నట్లు వైసీపీ నేతలపై ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై సీఈసీ స్పందించింది. నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులకు సీఈసీ లేఖ రాసినట్లు సమాచారం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా సీఈవోకు ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.వైసీపీ నేతలు జోగి రమేశ్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బహుమతులు పంచడం, చర్చిలలో ప్రచారం చేస్తున్న వీడియోలను కూడా జతచేసి ఎన్నికల కమిషన్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. అధికారులు కూడా వైసీపీ నేతల నుంచి గిఫ్ట్‌లు అందుకుంటున్నారని, ఇది వారి సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికారులను కూడా వైసీపీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నట్లు ఎంపీ తెలిపారు. చర్చిలలో పాస్టర్ల వద్ద వైసీపీకి ఓటు వేయాలని ప్రమాణం చేయించినట్లు జోగి రమేశ్‌ వీడియోలను సీఈసీకి అందజేశారు. మతం పేరుతో ఓట్లు అడుగుతున్న జోగి రమేశ్‌ను అనర్హునిగా ప్రకటించాలని ఎంపీ రఘురామ డిమాండ్‌ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *