న్యూ డిల్లీ 16:దేశ రాజధాని ఢల్లీి అలీపూర్‌లోని మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్‌ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సవిూపంలోని దుకాణాలతో పాటు ఇండ్లకు వ్యాపించాయి. అలీపూర్‌లోని దయాల్‌పూర్‌ మార్కెట్‌లోని ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఇద్దరు అగ్నికీలల్లో చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రం 5.25 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం గురించి సమాచారం అందింది.సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, మంటల చెలరేగడానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించింది. అక్కడ నిల్వ ఉంచిన రసాయనాలతో పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ‘పరిశ్రమ పక్కనే ఉన్న నాషా ముక్తి కేంద్రంలోకి మంటలు వ్యాపించాయి. పేలుడు కారణంగా భవనం కూలిపోయింది. 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా ఉంది’ అని ఢల్లీి ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియదని.. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. దేశ రాజధాని ఢల్లీి అలీపూర్‌లోని మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్‌ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సవిూపంలోని దుకాణాలతో పాటు ఇండ్లకు వ్యాపించాయి. అలీపూర్‌లోని దయాల్‌పూర్‌ మార్కెట్‌లోని ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఇద్దరు అగ్నికీలల్లో చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రం 5.25 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం గురించి సమాచారం అందింది.సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, మంటల చెలరేగడానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించింది. అక్కడ నిల్వ ఉంచిన రసాయనాలతో పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ‘పరిశ్రమ పక్కనే ఉన్న నాషా ముక్తి కేంద్రంలోకి మంటలు వ్యాపించాయి. పేలుడు కారణంగా భవనం కూలిపోయింది. 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా ఉంది’ అని ఢల్లీి ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియదని.. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *