బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి
బీజేపీ సీనియర్‌ నాయకులు రుద్ర శ్రీనివాస్‌
కోరుట్ల :బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని,ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సీనియర్‌ నాయకులు రుద్ర శ్రీనివాస్‌,ఆన్నారు.. గురువారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రుద్ర శ్రీనివాస్‌ నివాసంలో బీజేపీ పట్టణాధ్యక్షులు బింగి వెంకటేష్‌ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వారు పిలుపు నిచ్చారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370 రద్దుకు కృషి చేశారని అన్నారు.. అలాగే నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.. ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని దానికి అనుకూలంగా కార్యకర్తలు నాయకులు పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు.. అలాగే కొందరు సీనియర్‌ నాయకులని చెప్పుకుంటూ ఇన్ని రోజులు బిజెపి పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాని వాళ్లు పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రకటనలు చేయడం బాధాకరమని అన్నారు..అలాంటి వారు ఇప్పటికైనా అసత్యపు ఆరోపణలు మానుకొని పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి కలిసి పని చేయాలని హితవు పలికారు.. సమావేశ అనంతరం పలువురు పాత్రికేయ మిత్రులను బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేశారు.. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు సుధావేణి మహేష్‌, కౌన్సిలర్‌ మాడవేణి నరేష్‌, మాజీ పట్టణ అధ్యక్షులు చిరుమళ్ల ధనుంజయ్‌, జక్కుల జగదీశ్వర్‌, కంఠం ఉదయ్‌, ఎల్లాల నారాయణ, ఎర్ర రాజేందర్‌, బండారి వెంకటి, బీజేవైఎం పట్టణాధ్యక్షులు కలాల సాయిచంద్‌, చెట్లపల్లి సాగర్‌, దమ్మ సంతోష్‌, సంకు నరేందర్‌, మేకల గణేష్‌, బీజేపీ యువమోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *