ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన వైసిపి ప్రభుత్వం
నిరుద్యోగులను నట్టేట ముంచిన ప్రభుత్వం..
బుచ్చిరెడ్డిపాలెం ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పట్టుకున్న గంజాయి దర్శనమిస్తుందని ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన వైసిపి జగన్ ప్రభుత్వాన్ని సాగనంపుదామని కోవూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నగర పంచాయతీలోని మూడో వార్డులో ప్రజల వద్దకు తెలుగుదేశం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయనకు టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఆయన పర్యటిస్తుండగా ప్రజలు జేజేలు పలికారు. కాబోయే ఎమ్మెల్యే దినేష్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.3,4 వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి తాండ మారుతుందని , యువత చెడు మార్గంలోకి వెళ్లిపోయే పరిస్థితి నెలకొని ఉందని తీవ్రంగా ఖండిరచారు. ఇలాంటి వైసిపి ప్రభుత్వం మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మరల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గం పై తెలుగుదేశం జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనుచిత చర్యల వల్ల పరిశ్రమలు తరలిపోయాయి అన్నారు. నిరుద్యోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రభుత్వం గంజాయి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చింది అన్నారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వము ఏర్పాటు చేస్తుందన్నారు. తప్పనిసరిగా నిరుద్యోగ భృతి నిరుద్యోగులు కల్పిస్తామన్నారు. గెలిచిన వెంటనే జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేస్తామన్నారు. బీసీ నాయకులు బత్తల హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు ఎంవి శేషయ్య, టిడిపి మండల నాయకులు వింజం రామానాయుడు,దుగ్గిశెట్టి హరినాథ్, ఉసిరిపాటి ప్రసాద్. సిరి మావిళ్ళ రవికుమార్. వింజం మహేష్. జువ్వగుంట కళ్యాణ్ కుమార్,తాళ్ల నరసింహ స్వామి, చమకుల కృష్ణ చైతన్య, చిరుమామిళ్ల రవిబాబు, ఇతరులు ఉన్నారు.