తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రం ఢల్లీి కి బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్‌ నుంచి న్యూఢల్లీికి బయలుదేరి వెళ్లారు. ఈ రాత్రి 1, జన్పథ్‌ నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ బస చేస్తారు. పాయింట్మెంట్‌ షెడ్యూల్‌ ప్రకారం సీఎం జగన్‌, శుక్రవారం పు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కు ఇవ్వవలసిన ప్రత్యేక హోదా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు, ? పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు సంబంధించిన ఆమోదం, Iకేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండిరగ్‌ అంశాల పరిశీలన, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్తు కు సంబంధించి బకాయిల క్లియరెన్స్‌, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌ కు రావాల్సిన పన్ను చెల్లింపులు, జాతీయ ఆహార భద్రతాచట్టం కింద ఆంధ్రప్రదేశు మరింత ఎక్కువ కవరేజీ, ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలకు సమానంగా వాటా, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హావిూలు, కొత్త జిల్లాల్లో ఏర్పాటవుతున్న మెడికల్‌ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం, ఏపీఎండిసి కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు, ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండిరగులో ఉన్న సబ్సిడీ బకాయిల క్లియరెన్స్‌ లాంటి అంశాలను ప్రధానితో చర్చించవచ్చని సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *