హైదరాబాద్‌:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌ రావు విమర్శలు గుప్పించారు. జగన్‌ పిరికిపంద అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వలన జగన్‌ ముగినిపోతున్నారని సంచలన కామెంట్స్‌ చేశారు. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి దరిద్రుడి సలహాలతో జగన్కు తీవ్ర నష్టం జరగబోతోందన్నారు. టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఎన్నికల తర్వాత జగన్‌ శాసనసభకు కూడా రాడంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.
చరిత్ర తెలియకుండా జగన్‌ మట్లాడటం సరైంది కాదన్నారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు.. జగన్‌ డైపర్లు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు రోజా, విడదల రజనీకి కూడా జగన్‌ టికెట్‌ ఇవ్వరన్నారు. కొత్త ఇంచార్జ్ల్లో 35 మంది వరకు జగన్‌ బీఫాం ఇవ్వరన్నారు. తల్లి, చెల్లి పట్ల జగన్‌ వ్యవహరిస్తోన్న తీరును.. దేవుడు కూడా క్షమించడన్నారు.తండ్రిని చంపించిన వారితో జగన్‌ డబ్బుల కోసం ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. స్వార్థం కోసం దగ్గర బంధువు సునీల్‌ ఎవరో తెలియదన్న వ్యక్తి జగన్‌ అంటూ గోనె ప్రకాష్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *