ముంబై, నవంబర్‌ 24:డిసెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 18 రోజులు సెలవులు వచ్చాయి. క్రిస్మస్‌తో పాటు కొన్ని స్థానిక పండుగలు, సందర్భాల కారణంగా బ్యాంకులు మూతబడతాయి. ఈ హాలిడేస్‌ లిస్ట్‌లో.. రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. వీటితో పాటు డిసెంబరు 4 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకు దిగుతున్నాయి. కాబట్టి, వచ్చే నెలలో విూకు బ్యాంక్‌లో విూకు ఏ పని ఉన్నా, ముందు బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను చూసుకోండి. డిసెంబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవులు 1వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో ప్రారంభమై, 31వ తేదీన ఆదివారంతో ముగుస్తాయి. స్థానిక పండుగలు, సందర్భాల కారణంగా బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల కోసం, ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది.
డిసెంబర్‌ 1, 2023 ` రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్‌ 3, 2023 ` ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 4, 2023 ` సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ ఫెస్టివల్‌ కారణంగా గోవాలో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్‌ 9, 2023 ` రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 10, 2023 ` ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 12, 2023 ` ప`టోగన్‌ నెంగ్మింజా సంగ్మా కారణంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేస్తారు
డిసెంబర్‌ 13 డ 14, 2023 ` లోసంగ్‌/నామ్‌సంగ్‌ కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్‌ 17, 2023 ` ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 18, 2023 ` యు సోసో థామ్‌ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్‌ 19, 2023 ` విమోచన దినోత్సవం కారణంగా గోవాలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్‌ 23, 2023 ` నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 24, 2023 ` ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 25, 2023 ` క్రిస్మస్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 26, 2023 ` క్రిస్మస్‌ వేడుకల కారణంగా మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే
డిసెంబర్‌ 27, 2023 ` క్రిస్మస్‌ వేడుకల కారణంగా నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
డిసెంబర్‌ 30, 2023 ` యు కియాంగ్‌ నంగ్‌బా దృష్ట్యా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
డిసెంబర్‌ 31, 2023 ` ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
డిసెంబర్‌ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్‌ సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. ఆయా రోజుల్లో బ్యాంక్‌ సేవలు అందవు.
డిసెంబర్‌ 4, 2023: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఖఔః), పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ూఃఎ)
డిసెంబర్‌ 5, 2023: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (ఃనీః), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఃనీఎ)
డిసెంబర్‌ 6, 2023: కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
డిసెంబర్‌ 7, 2023: ఇండియన్‌ బ్యాంక్‌, యూకో (ఙఅూ) బ్యాంక్‌
డిసెంబర్‌ 8, 2023: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఙఃఎ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
డిసెంబర్‌ 11, 2023: అన్ని ప్రైవేట్‌ బ్యాంకులు
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
ఖీఃఎ, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. ‘హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌’, ‘రియల్‌`టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ హాలిడేస్‌’ డ ‘క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌’. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్‌ డ నెట్‌ బ్యాంకింగ్‌, ఙఖఎ, రుఓ సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే రుఓను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్‌ బ్యాంకింగ్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ లేదా ఙఖఎని ఉపయోగించవచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *