‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా కులగణన నివేదికను విడుదల చేయలేక.. దాచిపెట్టలేక.. కక్కలేక మింగలేక అన్నట్టుగా మారింది కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి. నివేదిక బహిర్గతమైతే ఇన్నాళ్లుగా కొనసాగిస్తున్న తమ ఆధిపత్యానికి అడ్డుపడుతుందని ఈ రెండు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండు వర్గాలను నొప్పించైనా సరే నివేదికను విడుదల చేసి, ఆ మేరకు బీసీ రిజర్వేషన్లను పెంచితే మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రతికూలత ఎదుర్కోక తప్పదని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. ఇతర వెనుకబడిన వర్గాలు దేశవ్యాప్తంగా సమాజంలో సగం కంటే ఎక్కువగా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. కానీ కచ్చితమైన గణాంకాలు మాత్రం లేవు. బీహార్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కులాల సర్వే నిర్వహించి, జనాభా శాతం ఆధారంగా వారికి రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలను పెంచడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీ వర్గాల ఓట్లను ఆకట్టుకోవడం కోసం అనేక రాజకీయపార్టీలు దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణలో కులాలవారిగా వివరాలు సేకరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రతిపక్ష కూటమిలో పెద్దన్నలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ఈ డిమాండ్‌తోనే ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ విషయంలో వీలైనంతగా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తూ ఆచితూచి అడుగులేస్తోంది. ఎందుకంటే.. సమాజంలో సగభాగం ఉన్న ఓబీసీలు ఓట్లు రాల్చే బ్రహ్మాస్త్రమే కావొచ్చు. కానీ ఏ కాస్త తేడా వచ్చినా మొత్తంగా బెడిసికొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి.బీహార్‌లో కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్ల పరిధిని విస్తరించిన తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సిద్ధరామయ్య గత హయాం 2017లోనే రాష్ట్రవ్యాప్తంగా కులాల లెక్కల సేకరణ జరిగింది. ఆ సర్వే నివేదిక లీక్‌ అయింది. నివేదికలో ూఃఅల సంఖ్య గణనీయంగా పెరిగిందని, లింగాయత్‌లు, వొక్కలిగలు వంటి ప్రధాన వర్గాల సంఖ్య తగ్గిందని తేలింది. దీంతో ఈ కులాల సర్వే శాస్త్రీయంగా జరగలేదని వొక్కలిగలు, లింగాయత్‌లు వాపోతున్నారు. కర్ణాటకలోని లింగాయత్‌ వర్గంపై చిన్నప్ప రెడ్డి కమిషన్‌ కులగణన నిర్వహించిందని, అందులో లింగాయత్‌ల సంఖ్య రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉందని తేలిందని, అయితే 2017 నాటి సర్వేలో ఆ సంఖ్య 14 శాతంగా ఉండడంపై సందేహాలు లేవనెత్తుతున్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా జరగలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇలాంటి అభ్యంతరాలతోనే వొక్కలిగలు కూడా సర్వే నివేదికను వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడమే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ రెండు వర్గాలు లేఖ రాశాయి. ఆ లేఖపై కర్ణాటక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ కూడా సంతకం చేయడం ఇక్కడ గమనార్హం.మరోవైపు జాతీయస్థాయిలో ఓబీసీ కులగణన డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముందు తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేసి చూపాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఆరేళ్ల క్రితమే సర్వే నిర్వహించి సిద్ధం చేసిన నివేదికను ఇప్పటికైనా బయటపెట్టకపోతే ఆ పార్టీ చేస్తున్న డిమాండ్‌కు అర్థం ఉండదు. ఇస్తున్న హావిూపై జనానికి నమ్మకం ఏర్పడదు. అందుకే ఈ నివేదికను బహిర్గతం చేయక తప్పని పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడిరది. ఓబీసీ వర్గానికి చెందిన సిద్ధరామయ్య నివేదికను విడుదల చేయడానికి సుముఖంగా ఉంటే.. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరేళ్లుగా కోల్డ్‌ స్టోరేజిలో ఉన్న ఈ సర్వే నివేదిక ఇకనైనా బయపడేనా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కుల నివేదిక అనే సామాజిక`ఆర్థిక, విద్యా సర్వేను ఆమోదించి ఆయా వర్గాలకు న్యాయం చేయాలన్నదే తన నిర్ణయమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నవంబర్‌ 24న ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ చైర్మన్‌ కె. జైప్రకాష్‌ హెగ్డే తెలిపారు. కులాల నివేదికను వొక్కలిగ, లింగాయత్‌ సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ, నివేదికను తిరస్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమం చేపట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో నివేదిక ఒరిజినల్‌ కాపీ మిస్సయింది. బీసీ కమిషన్‌ చైర్మన్‌ మాత్రం ఒరిజినల్‌ కాపీ మిస్సయినా.. డేటా మొత్తం సురక్షితంగా ఉందని వెల్లడిరచారు.కుల గణనను కాంగ్రెస్‌ అధిష్టానం జాతీయస్థాయిలో ఎన్నికల అస్త్రంగా మార్చడంతో, సర్వే రిపోర్టును బహిర్గతం చేయాలంటూ సిద్ధరామయ్యపై ఒత్తిడి పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, ఈ నివేదికను విడుదల చేస్తే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎదురుదెబ్బలు తినక తప్పదు. బీజేపీ ఈ రాజకీయ అవకాశం కోసం ఎదురుచూస్తూ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. మరోవైపు ఈ రెండువర్గాలను తమవైపు తిప్పుకునే రాజకీయ సవిూకరణాలు కూడా చేస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *