న్యూఢల్లీి నవంబర్ 7: బీహార్‌లో కుల గణన కు చెందిన రిపోర్టును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో 42 శాతం మంది కటిక పేదలే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడిరచారు. ఇక వెనుకబడిన, ఈడబ్ల్యూసీ కేటగిరీలకు చెందిన వారిలో 33 శాతం మంది ప్రజలు పేదలుగా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. జనరల్ క్యాటగిరీకి చెందిన 25.09 శాతం కుటుంబాలు పేదరికం జాబితాలో ఉన్నట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ద్వారా వెల్లడైంది.సర్వే చేపట్టిన డేటా ప్రకారం.. ఎస్సీల్లో కేవలం ఆరు శాతం మంది మాత్రమే తమ స్కూల్ చదువులు పూర్తి చేశారు. 11వ, 12వ తరగతి వరకు చదివిన వారిలో 9 శాతం మంది ఉన్నారు. బీహార్‌లో ఉన్న జనాభాలో 60 శాతం మంది ప్రజలు వెనుకబడిన తరగతులు లేక ఈడబ్ల్యూసీ వర్గానికి చెందిన వారే ఉన్నట్లు రిపోర్టులో స్పష్టం చేశారు.రాష్ట్రానికి చెందిన వారు సుమారు 50 లక్షల మంది బీహార్ బయట జీవిస్తున్నట్లు రిపోర్టులో తెలిపారు. ఉద్యోగం, విద్య కోసం వాళ్లు ఇతర రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 34.1 శాతం పేదలు ఉన్నట్లు రిపోర్టులో తేల్చారు. ఆ పేదల ఆదాయం నెలకు ఆరువేల కన్నా తక్కువగా ఉంది. రాష్ట్రంలో 29 శాతం మంది పది వేల కన్నా తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 10 వేల నుంచి 50 వేల మధ్య ఆదాయం ఉన్నవారు 28 శాతం ఉన్నారు. 50 వేల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య కేవలం 4 శాతం ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.