న్యూఢల్లీి నవంబర్‌ 7:: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్‌ నెట్‌ కేసుపై ఈనెల 9న సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. ఈనెల 9న కోర్ట్‌ నెంబర్‌ 6లో 11 వ నెంబర్‌గా చంద్రబాబు కేసు లిస్ట్‌ అయ్యింది. చంద్రబాబు ఫైబర్‌ నెట్‌ ముందస్తు బెయిల్‌ కేసును జస్టిస్‌ అనిరుద్ధ్‌ బోస్‌, జస్టిస్‌ బేలా ఎంత్రివేది ధర్మాసనం విచారించనుంది. కాగా.. 17` ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు పెండిరగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రేపు లేదా ఎల్లుండి 17 ఏ చంద్రబాబుకు వర్తింపుపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. 17 ఏపై తీర్పు పెండిరగ్‌ నేపథ్యంలో పైబర్‌ నెట్‌ కేసును గతంలో 9కి జస్టిస్‌ అనిరుద్ధ్‌ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదీల ధర్మాసనం వాయిదా వేసింది. 17 ఏ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *