న్యూఢల్లీి అక్టోబర్‌ 23: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగటం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రతో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కలిసిఉన్న ఫొటోలు లీక్‌ అవడం దుమారం రేపింది. లీక్డ్‌ ఫొటోలపై ఎంపీ శశి థరూర్‌ రియాక్టయ్యారు. మహువ మొయిత్రతో డిన్నర్‌ పార్టీలో తాను కలిసున్న ఫొటోలంటూ ఆన్‌లైన్‌లో వైరల్‌ చేస్తుండటంపై శశి థరూర్‌ మండిపడ్డారు. ఇవి దిగజారుడు రాజకీయాలని కొట్టిపారేశారు.ఈ ఫొటోలు తాను బిడ్డగా పిలిచే మొయిత్ర బర్త్‌డే వేడుకలకు సంబంధించినవని వివరణ ఇచ్చారు. ఈ ఫొటోలకు వారు ‘‘రహస్య భేటీ’’ రంగు పులిమేలా స్కెచ్‌ వేశారని మండిపడ్డారు. కేరళలోని కొట్టాయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మొయిత్ర బర్త్‌డే పార్టీకి హాజరయ్యానని, ఈ వేడుకల్లో దాదాపు 15 మంది పాల్గొన్నారని శశి థరూర్‌ చెప్పుకొచ్చారు.తన సోదరిని కూడా ఆహ్వానిస్తే ఆమె కూడా పాల్గొన్నారని అన్నారు. మహువ మొయిత్ర తన కంటే వయసులో దాదాపు 20 ఏండ్లు చిన్న అని, ఆమెను తాను బిడ్డలాగా చూస్తానని చెప్పారు. ఈ ఫొటోల్లో ఇతరులను చెరిపేసి తమ మధ్య రహస్య భేటీ జరిగిందని వక్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇది సీక్రెట్‌ విూటింగ్‌ కాదని, ఆమె బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇలా ఏమార్చారని శశి థరూర్‌ పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసేందుకే తాను ప్రాధాన్యత ఇస్తానని, ఇలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోనని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *