న్యూఢల్లీి అక్టోబర్‌ 23: భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నటి గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా వెల్లడిరచారు. రాజీనామా లేఖను కూడా షేర్‌ చేశారు. అయితే తనను మోసం చేసిన వ్యక్తికి బీజేపీ నాయకులు సహకరిస్తున్నారని, అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు గౌతమి తన లేఖలో పేర్కొన్నారు.ఇవాళ నేను తన జీవితంలో ఊహించలేని సంక్షోభంలో ఉన్నాను. బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి తనకు ఎలాంటి మద్దతు లేదు. అంతే కాకుండా తనను మోసం చేసిన వ్యక్తికి బీజేపీ నాయకత్వం మద్దతు ఇస్తుంది. తనను ఎవరూ వంచించలేరని ఆమె పేర్కొన్నారు.గత 25 ఏండ్ల నుంచి బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డాను అని గౌతమి తెలిపారు. చాలా బాధతో రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు పార్టీ యూనిట్‌ చీఫ్‌ కే అన్నమలైకు పంపారు. తన ప్రాపర్టీ, నగదు విషయంలో తనను మోసం చేసి సీ అలగప్పన్‌కు బీజేపీ నేతలు కొందరు సహకరిస్తున్నారని, అది ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతనని నటి గౌతమి స్పష్టం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *