ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ
డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లో అనారోగ్యాలు కూడా డబుల్‌ :మల్లికార్జున ఖర్గే
లఖ్‌నవూ అక్టోబర్‌ 25: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ హెపటైటిస్‌ సోకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కాన్‌పుర ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో 14 మంది పిల్లలకు రక్త మార్పిడి చేశారు. అనంతరం వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్త పరీక్షలు చేయగా హెచ్‌ఐవీ పాజిటీవ్‌, హెపటైటిస్‌ బి, సి సోకినట్లు తేలింది.ఈ ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లో అనారోగ్యాలు కూడా డబుల్‌ అవుతున్నాయని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ తప్పునకు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు.‘‘డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అనారోగ్యాలను రెట్టింపు చేస్తోంది. తలసేమియాతో బాధపడుతున్న 14 మంది పిల్లలకు హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని అందించారు. పిల్లలు చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నారు.బీజేపీప్రభుత్వానికి ఇది సిగ్గు చేటు’’అని ఖర్గే ఎక్స్‌(చీ)లో పోస్ట్‌ చేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ 10 హావిూలు ఇవ్వడంపై ఖర్గే మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి తప్పనిసరి. హాస్పిటల్‌ లో 180 మంది తలసేమియా రోగులుండగా.. 14 మందికి హెచ్‌ఐవీ సోకింది. బాధిత పిల్లలు 6 నుంచి 16 సంవత్సరాల వయస్సు కలిగిన వారే. 7 మందికి హెపటైటిస్‌ బి, అయిదుగురికి హెపటైటిస్‌ సి, ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలింది. బాధితులు కాన్‌పుర్‌, దేహత్‌, ఫరూఖాబాద్‌, ఔరైయా, ఇటావా, కన్నౌజ్‌ ప్రాంతాలకు చెందినవారు. సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు వ్యాధులు ఎలా సోకాయే కనుక్కునే పనిలో పడ్డారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసనలు చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *