మాజీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ.. అందుకే బేల మాటలు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దొరికితే దింగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు ప్రవర్తించారు. ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు.. ఇప్పటికి దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని చురకలంటించారు. స్కిల్ స్కాం కేసులో ప్రేమ చంద్రారెడ్డి మీద మాకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. స్కాంలో ఎవరి పాత్ర ఉంటే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు అభ్యంతరం చెప్పిన తర్వాతే ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది.