సోషల్ విూడియా లో అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేసే వారిపై నిఘా…
రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విద్వేషాలు రగిల్చేలా పోస్ట్ లు పెట్టే వారిపై,షేర్ చేసే వారిపై, గ్రూప్ అడ్మిన్లపై కఠిన చర్యలు
కడప:: సోషల్ విూడియా లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా సోషల్ విూడియా వేదికగా పరస్పర విమర్శలు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ శాంతి భద్రత లకు భంగం కలిగించేలా పోస్టు లు పెట్టే వారిపై సైబర్ సెల్ సోషల్ విూడియా విభాగం నిఘా ఉంచామని, సదరు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మవద్దని ఎస్.పి గారు సూచించారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి లేదా ఫార్వర్డ్ చేసే వారిపై నిఘా ఉంచామని, నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ విూడియా లో పోస్ట్ చేసే వారిపై, షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్ల పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్.పి హెచ్చరించారు.