పదిమంది లబ్దిదారులకు రూ13.20 లక్షలు విలువ చేసే చెక్కులను అందచేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం రాయచోటిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన పదిమంది లబ్దిదారులకు రూ13.20 లక్షలు విలువ చేసే చెక్కులను ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అందచేశారు.

లబ్దిదారుల వివరాలు:

గాలివీడు మండలం చీమచేరువుపల్లె గ్రామం కొప్పులవాండ్లపల్లి చెందిన కాల్వపల్లి.నీలమ్మ కు రూ 70 వేలు, పూలుకుంట గ్రామం గుంటికాడపల్లి చెందిన షేక్.మహబూబ్ బాషా కు రూ 1 లక్ష, వెలిగల్లు కస్పా కు చెందిన నీలగిరి షన్వాజ్ కు రూ 1 లక్ష,
రామాపురం
చిట్లూరు ఏకీలపల్లి చెందిన గాలివీటిరంగా కు రూ 1 లక్ష, రామాపురం నల్లగుట్టపల్లి కు చెందిన గంగిరెడ్డి వెంకటలక్షుమమ్మ కు రూ 1 లక్ష,
సంబేపల్లి
మోటకట్ల గ్రామము రోడ్డువారిపల్లి కి చెందిన దేశిరెడ్డి వెంకటరమణా రెడ్డి కు రూ 2. 50 లక్షలు,
లక్కిరెడ్డిపల్లి మండలం
కుర్నూతల గ్రామము దిగువ బత్తినవాండ్లపల్లి చెందిన పచ్చిపాల ధర్మారెడ్డి కి రూ 50 వేలు,
రాయచోటి
మహమ్మద్ పురా స్ట్రీట్ కు చెందిన షేక్.షఫీ కి రూ 50 వేలు,పెమ్మా డపల్లి గ్రామము గరుగుపల్లి చెందిన కుంచపు.జ్యోతి కి రూ 1 లక్ష,శిబ్యాల గ్రామము రెడ్డివారిపల్లి కి చెందిన సాధు కృష్ణారెడ్డి కు రూ 4 లక్షలు విలువ చేసే చెక్కులను శ్రీకాంత్ రెడ్డి అందచేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, ఫయాజ్ అహమ్మద్, రఘురామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *