రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ శనివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వ రకు పనిచేయడం ప్రారంభించాయి. రిజిస్ట్రేషన్స్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు కార్యాలయాలు రాత్రి వరకు పనిచేస్తాయి. స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్స్ శాఖ కమిషనర్ బీఆర్ మమతా ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను పూర్తి చేయా లని అధికారులకు సూచనలు చేశామన్నారు. సబ్‌రిజిస్ట్రార్లు రాత్రి 8 గంటల వరకు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని తెలిపారు