అక్టోబర్ 1, 3వ తేదీన తెలంగాణ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్, కాచిగూడ వద్ద మీడియాతో మాట్లాడుతూ విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుందని, బాగ్యనగరంలో రద్దీని తగ్గించుకునేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మిస్తున్నామని, దీనిని ఈ ఏడాది చివరిలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. వరంగల్‌లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభం చేసుకున్నామని తెలిపారు