హైదరాబాద్: ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు అయితే బయట మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్?క్రీమ్ పార్లర్?లో ఐస్‌క్రీమ్‌లను మాత్రం పిల్లలు తెగ ఇష్టంగా తింటున్నారట. రేటు ఎక్కువ ఉన్నా కూడా వెనుకాడకుండా తింటున్నారు. కారణం ఇక్కడ విస్కీని ఉపయోగించి తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లే. ఇవేంటో కూడా తెలియని చిన్నారులు ఈ ఐస్‌క్రీమ్ పట్ల ఆకర్షితులవుతున్నాయి.భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగేచిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులుబయటపెట్టారు. ఇవాళ పిల్లల ఐస్?క్రీమ్?లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ అండ్ ఫైవ్ ఐస్?క్రీమ్ పార్లర్?లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు.