టీడీపీ జాతీయ అధ్యక్షుడు (TDP National President), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు (Arrest)కు నిరసనగా బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీమంత్రి (Ex Minister) మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) ఆదివారం ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat)లో దీక్ష (Protest) చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ముందుగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించి నిరసన దీక్షను ప్రారంభించారు. అయితే మోత్కుపల్లి దీక్షకు ఎన్టీఆర్ ఘాట్‌లో అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీక్ష చేసి తీరుతానని మోత్కుపల్లి పోలీసులకు తెలిపారు. దీంతో గంట పాటు ఆయన దీక్షకు అనుమతిచ్చారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని మోత్కుపల్లి స్పష్టం చేశారు. గంట తర్వాత మోత్కుపల్లి దీక్షను పోలీసులు భగ్నం చేసే అవకాశముంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, బాబు అరెస్ట్‌ను మేధావులు ఖండించాలని మోత్కుపల్లి నరసింహులు పిలుపిచ్చారు