తాము యుద్ధం ప్రారంభించలేదు.. తెలిపారు. కానీ, యుద్ధాన్ని తామే ముగిస్తాం
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ
ఇజ్రాయెల్‌ అక్టోబర్‌ 10:ఇజ్రాయెల్‌ పై దాడితో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిరదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ అన్నారు. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. యుద్ధం తాము ప్రారంభించలేదని తెలిపారు. కానీ, ఈ యుద్ధాన్ని మాత్రం తామే ముగిస్తామంటూ హమాస్‌కు ఘాటు హెచ్చరికలు చేశారు. ‘ప్రస్తుతం దేశం యుద్ధం చేస్తోంది. దీన్ని మేం కోరుకోలేదు. కానీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఈ యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ యుద్ధాన్ని మేము ప్రారంభించనప్పటికీ.. ముగించేది మాత్రం ఇజ్రాయెలే. మా ప్రతిదాడి హమాస్‌తో పాటు ఇజ్రాయెల్‌ శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తిండిపోతుంది. ఇజ్రాయెల్‌పై దాడితో హమాస్‌ చారిత్రక తప్పిదానికి పాల్పడిరది’ అంటూ నెతన్యాహూ వ్యాఖ్యానించారు.హమాస్‌ కూడా ఐసిస్‌ లాంటి ఉగ్ర సంస్థేనని నేతన్యాహు వ్యాఖ్యానించారు. ప్రజలంతా కలిసికట్టుగా దాన్ని ఓడిరచాలని పిలుపునిచ్చారు. హింస, అనాగరికతకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి దేశం తరపునా ఇజ్రాయెల్‌ ఈ యుద్ధం చేస్తోందని చెప్పారు. తమకు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ సందర్భంగా నేతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో ఇప్పటి వరకూ 1,600 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *