కాలుష్యాన్ని నియంత్రించుకోలేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరిస్‌ హెచ్చరించారు. వాతావర్ణ మార్పుల కారణంగా సముద్రం మానవాళిని ముంచేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అంటున్నారు. ముఖ్యంగా పసిఫిక్‌ మహా సముద్ర ప్రాంతానికి ఈ ముప్పు ఎక్కువగా పొంచి ఉందని అంటున్నారు. టోంగా లో జరుగుతున్న పసిఫిక్‌ ఐలండ్‌ ఫోరమ్‌ లీడర్స్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను వెల్లడిరచారు. పెరుగుతున్న సముద్ర మట్టాలు మన జనావాసాలను చేరుకుని ముంచెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి రెండు ప్రత్యేక నివేదికలు విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం పసిఫిక్‌ నైరుతి ప్రాంతం ప్రధానంగా మూడు సమస్యలను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు, సముద్రపు నీటిలో పెరుగుతున్న ఆవ్లిూకరణ (ఎసిడిటీ), సముద్రపు నీటిలో పెరుగుతున్న వేడి అనే ఈ మూడు సమస్యలని ‘స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమేట్‌ ఇన్‌ ది సౌత్‌ వెస్ట్‌ పసిఫిక్‌’ నివేదిక తెలిపింది. శిలాజ ఇంధనాలను మండిరచడం వల్ల ఏర్పడే కర్బన ఉద్గారాల కారణంగా భూగోళం మండిపోతోందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమస్యకు ప్రధాన కారణమని, ఈ వేడి ప్రభావం సముద్రాలపై పడిరదని అని గ్యుటెరిస్‌ తన ప్రసంగంలో చెప్పారు. ‘మార్పుని ఎదుర్కొందాం’ అనే నినాదంతో సమావేశాలు మొదలయ్యాయి. కాగా ఈ కార్యక్రమం ప్రారంభం రోజున ఆడిటోరియంలోకి వరద నీరు పోటెత్తింది. భూకంపం కారణంగా స్థానికంగా కొన్ని ప్రాంతాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. దీన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేదానికి ఇదే ఉదాహరణ అని, ఎలాంటి అననుకూల పరిస్తితులనైనా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని గ్యుటెరిస్‌ పిలుపునిచ్చారు. సమద్ర మట్టాల పెరుగుదలపై ఐక్యరాజ్య సమితి యాక్షన్‌ టీమ్‌ ఒక నివేదిక విడుదల చేసింది. గత 3వేల ఏళ్లతో పోలిస్తే ప్రపంచ సముద్ర మట్టాల సగటు ఇంతకు ముందెన్నడు లేనివిధంగా పెరుగుతోందని పేర్కొంది. గత 3 వేల ఏళ్లతో పోల్చితే సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన మూడు దశాబ్దాలలో సముద్ర నీటి మట్టం 9.4 సెంటీవిూటర్లు పెరగ్గా, పసిఫిక్‌ ప్రాంతంలో మాత్ర 15 సెంటీవిూటర్లు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియా, అయోటెరోవా వంటి దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. సెక్రటరీ జనరల్‌ గ్యుటెరిస్‌ అధ్యక్షతన జరిగిన ఈ పసిఫిక్‌ ఐలాండ్స్‌ ఫోరమ్‌ లీడర్స్‌ విూటింగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ తోపాటు మరో 18 పసిఫిక్‌ దీవుల నాయకులు హాజరయ్యారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడానికి బదులుగా గ్యాస్‌ వెలికితీత, వినియోగాలను 2050 వరకు లేదా ఆపైన కూడా కొనసాగిస్తామని ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ చెప్పారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన పసిఫిక్‌ దీవుల అధినేతలంతా ఆస్ట్రేలియాను ఏకాకిని చేశారు. భూతాపాన్ని 1.5 డిగ్రీలు తగ్గించాలన్న 2015 నాటి పారిస్‌ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ కట్టుబడి ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలు తగ్గిస్తేనే గ్రీన్‌ల్యాండ్‌, అంటార్కిటిక్‌ మంచు పొరలు కూలిపోవడాన్ని ఆపగల అవకాశాలు సజీవంగా ఉంటాయని గ్యుటెరిస్‌ అభిప్రాయపడ్డారు. ఇటు ఆంధ్రలోనూ..సాధారణంగా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు అంటే భూకంపాలు, సునావిూ వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు సముద్రం వెనక్కు వెళ్లడమో లేదంటే ముందుకు రావడమో జరుగుతూ ఉంటాయి విశాఖ పట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆర్కే బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లింది. విశాఖ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్కే బీచ్‌. ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు, పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. అయితే తాజాగా ఇక్కడ ఓ అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 400 విూటర్ల దూరం సముద్రంలోని నీళ్లు వెనక్కు వెళ్లాయి. సముద్రం లోపలికి వెళ్లడంతో రాళ్లు, శిలలు బయటపడ్డాయి.సముద్రంలోన నీరు విూటర్ల మేర వెనక్కు వెళ్లిందని తెలిసి ఈ వార్త దావనంలా వైజాగ్‌ మొత్తం నిమిషాల్లో వ్యాపించింది. గతంలో అంటే ఈ ఏడాది జనవరిలోనూ సముద్రం వెనక్కు వెళ్లింది. అయితే ఇలా సముద్రం వెనక్కు జరగడంపై నిపుణులు విశ్లేషించారు. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్లే సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని, అప్పుడు సముద్ర జల్లాల్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుందని చెబుతున్నారు. అలాగే సముద్రంలో జరిగే అనేక పరిణామాల వల్ల కూడా ఇలాంటి పరిణామాలు ఏర్పడతాయని చెబుతున్నారు. దీని వల్ల సముద్రంలో నీరు వెనక్కు జరుగుతుందని అంటున్నారు.సూర్యుడితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి అధికంగా ఉంటుందని.. భూమికి దగ్గరగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. ఈ ఆటుపోట్లకు చంద్రుడని చెబుతున్నారు. వీటికి అలలు కూడా ఓ కారణమంటున్నారు. సముద్రం వెనక్కు వెళ్లడానికి మరో రీజన్‌ కూడా ఉంటున్నారు. సముద్రం ఉపరితలంపై నీటికణం పైకి చేరినప్పుడు కాస్త నెమ్మదించిన సమయంలో గురుత్వాకర్షణ శక్తి దానిని వెనక్కి లాగుతుంది. దీంతో పైకి వచ్చి నీటి కణం తిరిగి దాని అసలు స్థానానికి చేరుకుంటుంది. ఈ కారణంగానే సముద్రపు నీరు ఒడ్డుకు వచ్చి.. ఆ తర్వాత వెనక్కి నెట్టబడుతుందని మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే ఇలా సముద్రం వెనక్కు వెళుతున్నప్పుడు పర్యాటకులు కాస్త అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలలు వెంట పరిగెత్తడం చేయరాదని, సముద్ర తీర ప్రాంతాన్ని దూరం నుండే ఎంజాయ్‌ చేయాలని, దగ్గరకు వెళ్లకూడదని సూచిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *