న్యూఢల్లీి:ఢల్లీి `లిక్కర్‌ స్కామ్‌ లో జైలులో ఉన్నఎమ్మెల్యసీ కవితకు మంగళవారం బెయిల్‌ లభించింది. ఆమెకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. బెయిల్‌ పిటిషన్‌ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్‌ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొంది.
న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ . కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉందని తెలిపారు. ఇప్పటికే కవిత బెయిల్‌ పిటిషన్పై వాదనలు ముగిశాయని తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని కోర్టుకు విన్నిఇంచారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు.దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్‌ గ్రూప్‌ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *