కోల్‌ కత్తా, ఆగస్టు 17: ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం మనది. నిలువెల్లా ప్రజాస్వామ్యస్ఫూర్తిని ప్రదర్శించే దేశం మనది. లౌకికత్వం, భిన్నత్వంలో ఏకత్వం వంటి విభిన్నతలను కలిగి ఉన్న భూ భాగం మనది.. అలాంటి మనదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఓటు వేసి గెలిపించిన వారు అధికారులకు వస్తారు. ఐదు సంవత్సరాలపాటు ప్రజా సేవ చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అధికారం దక్కిన తర్వాత ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి పూర్తిగా మారిపోతోంది. దోచుకోవడం, దాచుకోవడం పరిపాటిగా మారిపోతుంది. గిట్టని వారిపై దాడులు చేయడం, నచ్చని వారి గొంతును నొక్కడం సర్వ సామాన్యమైపోతోంది. అంతేకాదు అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు పరిపాలకులు ఎంతటి దారుణానికైనా తెగిస్తున్నారు.. చివరికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తున్నారు. వెనుకటికి రాజులు, చక్రవర్తులు, నియంతలు ఏర్పాటు చేసుకున్నట్లు.. సొంతంగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నుంచే వేతనాలు ఇస్తుండడంగ్భ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇక ప్రస్తుతం మన దేశంలో ఈ తరహా పరిపాలన సాగిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది..ఏపీలో 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు టిడిపికి అధికారాన్ని దూరం చేశారు. అదే సమయంలో 151 సీట్లతో వైసిపికి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు. జగన్‌ కూడా వాలంటీర్ల పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పింఛన్ల పంపిణీ నుంచి మొదలుపెడితే అనేక విధులను వారికి అప్పగించారు. వారు ఒక రకంగా అనధికారిక వైసీపీ కార్యకర్తలు లాగా పని చేశారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నప్పటికీ.. చివరికి ఆ వ్యవస్థ జగన్మోహన్‌ రెడ్డికి 2024 ఎన్నికల్లో అధికారాన్ని దూరం చేసింది. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మమతా బెనర్జీ సివిక్‌ వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఆ వ్యవస్థ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అనధికారిక తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు మించి పని చేస్తోంది. కోల్‌ కతా లోని ఆర్‌ జీ కార్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన తర్వాత ఒకసారిగా ఈ సివిక్‌ వాలంటీర్‌ తెరపైకి వచ్చింది. దాని గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై అక్కడి ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.సివిల్‌ వాలంటీర్లకు రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. వారిని ట్రాఫిక్‌ గార్డులుగా, పోలీస్‌ స్టేషన్లో వద్ద కాపలదారులుగా మాత్రమే నియమించినట్టు మమత ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన పండుగ సమయంలో ట్రాఫిక్‌ ను క్రమబద్ధీకరించడం, అనధికారికంగా పార్కు చేసిన వాహనాలను తొలగించడం, పోలీసులకు సంబంధించిన అధికారిక విధుల్లో సహకరించడం, ప్రజా భద్రతను పర్యవేక్షించడం, అధికారులు చెప్పిన పనులు చేయడం వీరి ప్రాథమిక విధుల్లో కొన్ని. కానీ సంజయ్‌ రాయ్‌ అనే వ్యక్తిని సివిల్‌ వాలంటీర్‌ గా విధుల్లోకి తీసుకున్నాడు. అతడు తనకున్న అధికారంతో ఆర్జీ కార్‌ ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోకి వెళ్లే అవకాశాన్ని పొందాడు. ఇదే సమయంలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడ్డాడు. అసలు ఈ వ్యవస్థ అత్యంత దారుణమైందని’’ సిపిఎం నేత సృజన్‌ చక్రవర్తి ఆరోపిస్తున్నారు.’’ రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలు కూడా ఉండవు. సివిక్‌ వాలంటీర్‌ గా పనికి వస్తాడని అధికార పార్టీ నేతల నిర్ణయిస్తారు. వారే ఒక జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత వారి నియామకం జరిగిపోతుంది. ఇలా ఎంపికైన వారిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌ రాష్ట్రంలో పోలీసులను కూడా నియంత్రించే స్థాయికి సివిక్‌ వాళ్లటీర్ల వ్యవస్థ ఎదిగిందని’’ సృజన్‌ చక్రవర్తి చెబుతున్నారు.. మరోవైపు సంజయ్‌ రాయ్‌ పై గతంలో గృహహింసకేసు నమోదయిందని, కానీ అతడు సివిక్‌ వాలంటీర్‌ కావడంతో పోలీసులు అరెస్ట్‌ చేయలేదని సృజన్‌ పేర్కొన్నారు.ఇక విద్యార్థి ఉద్యమ కార్యకర్త అనిస్‌ ఖాన్‌ అనే యువకుడు 2022లో హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో అతని హత్య వెనుక సివిక్‌ వాలంటీర్‌ ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో ఆ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలని అప్పటి అడ్వకేట్‌ జనరల్‌ గోపాల్‌ ముఖోపాధ్యాయ అంతర్గతంగా వ్యాఖ్యానించడం ప్రకంపనలు కలిగించింది. ఆ తర్వాత అది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన సవరించే ప్రయత్నం చేశారు. ఇక ఇటీవల ఒక ఓ డ్రైవర్‌ కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సివిక్‌ వాలంటీర్‌ అతడి వద్ద నుంచి 11,370 రూపాయలు లంచంగా తీసుకున్నాడు..కోల్‌ కతా లోని లేక్‌ కాళీ బరీ ఆలయంలో వాహనాలకు పూజ చేయిస్తే కచ్చితంగా అక్కడి సివిక్‌ వాలంటీర్లకు కచ్చితంగా 100 లేదా 200 ఇవ్వాల్సిందే. ఇక సివిక్‌ వాలంటీర్లను స్వచ్ఛంద సేవకులుగా పేర్కొంటున్న ప్రభుత్వం.. హోం శాఖ నుంచి వారికి ప్రతినెల జీతాలు చెల్లిస్తోంది. వారిని పోలీసులతో కలిపి తిప్పుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతను పర్యవేక్షించేందుకు వారిని కూడా భాగం చేస్తోంది. దీనిపట్ల పోలీసులు అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ..పై బాస్‌ లు మొత్తం అధికార పార్టీకి తొత్తులు కావడంతో ఏవిూ అనలేని పరిస్థితి.. ఇలాంటి వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న మమతా బెనర్జీ లాంటివాళ్ళు.. దీదీ గా అభివర్ణించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో బెంగాల్‌ ప్రజలు చేసుకున్న పాపం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *