రాజకీయ స్టార్టప్‌లు లాంఛ్ చేయాలని చూశారు
స్టార్టప్ మహాకుంభ్ వేదికగా రాహుల్‌పై మోదీ సెటైర్లు
న్యూ డిల్లీ మార్చ్ 20: అంకురాల (స్టార్టప్‌లు) అభివృద్ధి, వ్యాపార ఐడియాలపై మేథోమథనం సాగించేందుకు ఢల్లీిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న స్టార్టప్ మహాకుంభ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. చాలా మంది రాజకీయ స్టార్టప్‌లను లాంఛ్ చేయాలని పలుమార్లు ప్రయత్నించారని కానీ వారికి, విూకు (నిజమైన స్టార్టప్‌ల) మధ్య వ్యత్యాసం ఏంటంటే విూరు నూతన ఆలోచనల వెంట పరుగులు పెడుతుంటారని రాహుల్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.విూ స్టార్టప్ ఆలోచన విఫలమైన అనంతరం విూరు మరిన్ని నూతన ఆలోచనలకు పదును పెడుతుంటారని అన్నారు. భారత్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటోందని వినూత్న రీతిలో అభివృద్ధి దిశగా పురోగిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇవాళ భారత్‌లో ఉత్సాహం, సానుకూల శక్తి వెల్లడవుతోందని, స్టాల్స్‌ను కలియతిరుగుతూ విూ ఆవిష్కరణలను చూసిన అనంతరం భారత్ రాబోయే రోజుల్లో ఎన్నో యూనికార్న్‌లు, డెకాకార్న్‌లకు వేదిక కానుందని భావిస్తున్నానని అన్నారు.భారత్‌లో ప్రస్తుతం వినూత్న అవకాశాలు వృద్ధి చెందుతున్నాయని, స్టార్టప్ కల్చర్ పెరుగుతున్నదని ప్రధాని వివరించారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని చెప్పారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ కేంద్రమని, దేశంలో 1.25 లక్షలకు పైగా నమోదిత స్టార్టప్‌లున్నాయని, ఇందులో 110 యూనికార్న్‌లు కాగా స్టార్టప్‌ల్లో 12 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారని ప్రధాని పేర్కొన్నారు.