గ్రూప్ -2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు నకిలీ హాల్ టికెట్ తో కర్నూలు నుంచి పరీక్ష రాయుటకు చిత్తూరు కు వచ్చిన అభ్యర్థి – కేసునమోదు – ముద్దాయిని అరెస్టు చేసి నకిలీ హాల్ టికెట్ తయారు చేయుటకు ఉపయోగించిన కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగినది.
*
గత సంవత్సరం నవంబర్ నేఅలో APPSC ప్రకటించిన గ్రూప్ – 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలను కమిషన్ వారు 25-02-2024వ తేది రాష్ట్ర వ్యాప్తముగా నిర్వహించినారు, కమిషన్ వారు సదరు పరీక్షకు సంబంధించి అభ్యర్థుల నుంచి  ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అభ్యర్థులకు హాల్ టికెట్ లను జారి చేసినారు, సదరు హాల్ టికెట్ లను APPSC యొక్క అధికారిక వెబ్ సైట్ లో నుండి అభ్యర్థి యొక్క వ్యక్తిగత వివరములతో డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా, క్రిష్ణగిరి మండలం, కంబాలపాడు గ్రామానికి చెందిన H. మారప్ప కుమారుడు H. సుదర్శనం అను అతను, డోన్ పట్టణంలో రాజ కాంప్లెక్స్ లో ఉన్న మీసేవ కేంద్రంలో పని చేస్తున్న వరుసకు తమ్ముడు అయిన M. ఇమ్మనుఎల్ అను అతని వద్ద అతని వ్యక్తిగత వివరములు మరియు అప్లికేషన్ ప్రాసెస్ నగదు చెల్లించి, అతని పై నమ్మకంతో ఆన్లైన్ లో గ్రూప్ – 2 ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేయమని కోరడం జరిగినది. కాని, M. ఇమ్మనుఎల్ వారి మధ్య ఉన్న వ్యక్తిగత వైషమ్యాలను మనసులో ఉంచుకొని H. సుదర్శనం ను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో యొక్క ఆన్లైన్ దరఖాస్తు చేయకుండా ఉన్నాడు.
  దరఖాస్తు గడువు ముగిసి, కమిషన్ వారు హాల్ టికెట్ లు జారి చేసినప్పుడు, H. సుదర్శనం గ్రూప్ – 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ ను M. ఇమ్మనుఎల్ ను అడగడం జరిగినది. అంతకుముందే M. ఇమ్మనుఎల్ అతను పని చేస్తున్న మీ సేవ కేంద్రం లో మండ్ల శ్రీనివాసులు అను అభ్యర్థి APPSC కమిషన్ వెబ్సైటు నుండి అతని హాల్ టికెట్ డౌన్ లోడ్ డౌన్ లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని వెళ్లి ఉన్నాడు. H. సుదర్శనం పదే పదే గ్రూప్ -2 హాల్ టికెట్ గురించి అడగటం వలన మండ్ల శ్రీనివాసులు యొక్క ఒరిజినల్ హాల్ టికెట్ న్ ని PDF ఫార్మటు లో మీసేవ యొక్క కంప్యూటర్ లో సేవింగ్ లో ఉండటంతో, M. ఇమ్మనుఎల్ నేరపూరిత ఉద్దేశ్యంతో సదరు మండ్ల శ్రీనివాసులు యొక్క ఒరిజినల్ హాల్ టికెట్ ను మీసేవ లో ఉన్న కంప్యూటర్ నుంచి PDF కన్వర్షన్ అప్లికేషన్ ద్వారా MS word అప్లికేషన్ లోనికి మార్చుకొని, H. సుదర్శనం యొక్క వ్యక్తి గత వివరములు మరియు ఫోటో ను మండ్ల శ్రీనివాసులు యొక్క హాల్ టికెట్ లో ఎడిట్ చేసి, నకిలీ హాల్ టికెట్ తయారు చేసి, M. ఇమ్మనుఎల్ చేసిన నేరము H. సుదర్శనం పరీక్ష రాయుటకు వెళితే బయట పడుతుందని భావించిన M. ఇమ్మనుఎల్, H. సుదర్శనం పరీక్ష కేంద్రం దూరముగా ఉంటె సమయానికి చేరుకోనలేక, తిరిగు ప్రయాణం అవుతాడు అని భావించి ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న చిత్తూరు టౌన్, మర్రిమాను వీధి, నారాయణ కాలేజి పరీక్షా కేంద్రం ఎడిట్ చేసిఉన్నాడు.
వాస్తవానికి చిత్తూరు జిల్లలో ఏ నారాయణ కాలేజ్ కూడా పరీక్ష కేంద్రంగా లేదు.              M. ఇమ్మనుఎల్ ఇచ్చిన నకిలీ హాల్ టికెట్ ను అసలైనదిగా నమ్మి H. సుదర్శనం చిత్తూరు వరకు వచ్చి నకిలీ హాల్ టికెట్ తో పరీక్షా కేంద్రాన్ని గుర్తించలేక, కమిషన్ అధికారులని సంప్రదించి, సదరు M. ఇమ్మనుఎల్ ఇచ్చిన హాల్ టికెట్ నకిలిదని గుర్తించి చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసుకున్న పోలీస్ వారు చిత్తూర్ జిల్లా ఎస్.పి. శ్రీ P. జాషువా IPS, గారి సూచనలతో మేరకు చిత్తూర్ డి.ఎస్.పి. శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి పర్యవేక్షణలో, దర్యాప్తును కొనసాగించి, కుర్నూలో జిల్లా, డోన్ లో M. ఇమ్మనుఎల్ ని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరం చేయుటకు ఉపయోగించిన ఒక కంప్యూటర్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని, దర్యాప్తులో భాగముగా జుడిషియల్ కస్టడీకి తరలింపు.
అరెస్టు కాబడిన ముద్దాయి వివరములు:
M. ఇమ్మనియేలూ, వయసు: 24 సంవత్సరములు, తండ్రి: M. చిన్న మారెప్ప, కంబాలపాడు గ్రామము మరియు పోస్ట్, క్రిష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా.
దర్యాప్తులో పాల్గొని ముద్దాయిని త్వరితగతిన పట్టుకున్న చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ సిబ్బందిని చిత్తూర్ జిల్లా ఎస్.పి. శ్రీ P. జాషువా IPS, గారు మరియు చిత్తూర్ డి.ఎస్.పి. శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ప్రత్యకముగా అభినందించడం జరిగినది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *