ఎన్‌కౌంటర్‌లో 12 మంది పోలీసులతో సహా మరో 13 మందికి జీవిత ఖైదు
బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసు అధికారులకు ఇది మొదటి శిక్ష
ముంబై మార్చ్ 19: 2006లో బూటకపు ఎన్‌కౌంటర్‌లో లఖన్ భయ్యా హత్య కేసులో 12 మంది పోలీసులతో సహా మరో 13 మందికి విధించిన జీవిత ఖైదును సమర్థిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ముంబై పోలీసు మాజీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మకు జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరుగురు పౌరులను నిర్దోషులుగా ప్రకటించింది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ అనుచరుడి ఎన్ కౌంటర్ కేసులో బాంబే కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. బూటకపు ఎన్‌కౌంటర్‌లో పోలీసు అధికారులకు ఇది మొదటి శిక్ష.