న్యూఢల్లీి, మార్చి 19: దేశ పోలీసు వ్యవస్థలో సంచలనం నమోదైంది. ఇప్పటి వరకు ఒకే కుటుంబంలోని ఐపీఎస్‌లుగా ఎంపికైన విషయం తెలిసిందే. వేర్వేరు రాష్ట్రాల్లో ఐపీఎస్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారు కూడా ఉన్నారు. మన ఏపీలోనూ ఐపీఎస్‌ భార్యా భర్తలుఅనురాధ, సురేంద్రబాబు పనిచేసిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు ఏకంగా రెండు రాష్ట్రాలకు పోలీసు బాసులుగా పనిచేస్తుండడం మాత్రం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో వీరి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఐపీఎస్లు అవ్వడం సాధరణమే అయినా.. వారు రెండు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులు కావడం ఆసక్తిగా మారింది. దేశ పోలీస్‌ శాఖ చరిత్రలోనే ఇలా జరగడం ఇది తొలిసారి. ఇద్దరిలో ఒకరు ఏడాది కాలంగా డీజీపీ పని చేస్తున్నారు. మరొకరు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.ప్రస్తుతం ఆసక్తిగా మారిన ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకే రాష్ట్రం బిహార్‌కు చెందిన వారు. బిహార్కు చెందిన సహాయ్‌ కుటుంబంలో మొత్తం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు. వివేక్‌ సహాయ్‌ 1988 బ్యాచ్‌, వికాస్‌ సహాయ్‌ 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు. విక్రమ్‌ సహాయ్‌ 1992 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. గతేడాది కాలంగా గుజరాత్‌ కి వికాస్‌ సహాయ్‌ డీజీపీగా ఉన్నారు. అయితే ఈయన సోదరుడు వివేక్‌ సహాయ్‌ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పశ్చిమ బంగాల్‌ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఎన్నికలో షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత బెంగాల్‌ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన బంగాల్‌ డీజీపీ పదవికి ముగ్గురు పేర్లను ఎన్నికల సంఘానికి పంపారు. వారిలో వివేక్‌ సహాయ్ను బంగాల్‌ డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా అయ్యారు.
బిహార్‌(లో జన్మించిన వివేక్‌, వికాస్‌లు.. ఒకరు గుజరాత్‌కు, మరొకరు పశ్చిమ బెంగాల్‌కు డీజీపీలు కావడంతో బిహార్‌లో అధికారులు సంబరాలు చేసుకుంటున్నారు. వివేక్‌ సహాయ్‌ బంగాల్‌ కేడర్కు చెందిన 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. గతంలో డీజీ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హోమ్‌ గార్డ్గా పనిచేశారు. 2021లో బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సెక్యూరిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. వివేక్‌ సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా విఫలమయ్యాడని ఆ సంవత్సరమే ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. మళ్లీ 2023లో డీజీగా బాధ్యతలు అప్పగించారు. ఇక వికాస్‌ సహాయ్‌ విషయానికొస్తే 1989 బ్యాచ్కు చెందిన ఐపీఎస్‌ అధికారి. 1999లో గుజరాత్‌ లోని ఆనంద్‌ జిల్లాకు ఎస్పీగా నియమితులయ్యారు. 2001లో అహ్మదాబాద్లో రూరల్‌లో ఎస్పీగా పనిచేశారు. 2002లో అహ్మదాబాద్‌లోనే జోన్‌ 2,3కి డీసీపీగా నియమితులయ్యారు. 2004లో ట్రాఫిక్‌ డీసీపీ, 2005లో అహ్మదాబాద్‌లో అదనపు ట్రాఫిక్‌ సీపీ. ఆ తర్వాత 2007లో సూరత్‌లో అదనపు సీపీగా నియమితులయ్యారు. 2008లో జాయింట్‌ సీపీ సూరత్‌గా, 2009లో ఐజీ (సెక్యూరిటీ), 2010లో ఐజీ (సీఐడీ)గా పనిచేశారు. 2023లో గుజరాత్కు డీజీపీగా నిమమితులయ్యారు. మొత్తంగా ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం.. అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకుండా పోవడం వంటివి విశేషం. అంతేకాదు.. వీరికి రాజకీయ నేతల అండదండలు కూడా కడుదూరం. కేవలం సర్వీస్‌ రూల్స్‌ను పాటిస్తూ.. అనతికాలంలోనే గుర్తింపు పొందారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *