లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ వెల్లడిరచింది. మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 19 న మొదటి విడత మొదలై జూన్ 1న మలి విడత పూర్తవుతుంది. గత లోక్‌సభ ఎన్నికలనూ ఇలాగే 7 విడతల్లో నిర్వహించింది ఈసీ. అన్నివిడతలు అంటే ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ఈసారి ఈ విడతల్ని తగ్గిస్తుందని భావించినా అదే తరహాలో కొనసాగించనున్నట్టు తెలిపింది. 1951`52 మధ్య కాలంలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు తొలిసారి ఇంత సుదీర్ఘంగా సాగాయి. ఇది రెండో అతి పెద్ద ఎన్నికల షెడ్యూల్. మొత్తంగా చూస్తే 44 రోజుల పాటు పోలింగ్ జరగనుంది. అయితే…నోటిఫికేషన్‌లు, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అన్నీ కలుపుకుంటే మొత్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ 82 రోజుల పాటు కొనసాగనుంది. ఇన్ని రోజుల పాటు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం..గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చి చూస్తే…ఈ సారి 6 రోజుల పాటు ఆలస్యంగా షెడ్యూల్‌ని విడుదల చేయడం. నిజానికి ఎప్పటిలాగే ఈ తేదీల్ని విడుదల చేయాలని ఈసీ భావించినా ఉన్నట్టుండి కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. మొత్తం ముగ్గురు సభ్యులతో కూడిన ఈ ప్యానెల్‌లో అప్పటికే ఓ ప్లేస్ వేకెన్సీ ఉంది. దానికి తోడు అరుణ్ గోయల్ కూడా వెళ్లిపోయారు. ఫలితంగా ఈ రెండు స్థానాల్ని భర్తీ చేయడానికి కాస్త సమయం పట్టింది. ఆ తరవాత సెలెక్షన్ కమిటీ కేరళకి చెందిన జ్ఞానేశ్ కుమార్, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధులను ఎన్నికల కమిషనర్లుగా నియమించింది. మార్చి 14న ఈ నియామకం జరగ్గా మార్చి 15న వాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. ఆ మరుసటి రోజే అంటే మార్చి 16న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇక మార్చి,ఏప్రిల్ నెలల్లో వరుసగా పండుగలు ఉండడం కూడా ఎన్నికల షెడ్యూల్ గడువుని పెంచడానికి మరో కారణం. హోళీ, తమిళ కొత్త సంవత్సరం, బైశాఖి తదితర పండుగలున్నాయి. ఈ సెలవు రోజులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఎన్నికల సంఘం. వీటితో పాటు భద్రతా కారణాలూ ఉన్నాయి. భద్రతా బలగాలు ఓ విడత ఎన్నికలు ముగిశాక మరో విడత ఎన్నికలకు వేరే చోటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఇలా ప్రతి రెండు విడతల మధ్య ఓ చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే మొత్తంగా ఆరు రోజుల సమయం పడుతోంది. ఈ మధ్యలో పండుగ రోజులున్నాయి. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ గడువుకి ఎక్కడా ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంది ఈసీ. ఫలితంగానే ఇంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియని నిర్వహించాల్సి వస్తోందని ఈసీ వర్గాలు వెల్లడిరచాయి. జూన్ 1వ తేదీన 7వ దశ పోలింగ్ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఒకేసారి అన్ని ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలి
పబ్లిక్ ఆస్తులు` బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు, రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నీటినీ వెంటనే తొలగించాలి.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విూడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లను నిలిపి వేయాలిప్రభుత్వ వెబ్ సైట్ లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు,రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలిఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదు
ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు జరపాలన్నదే తమ లక్ష్యమని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అన్నారు. అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకోవచ్చని చెప్పారు. కేవైసీ యాప్ లో అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఎవరైనా తాయిలాలు, నగదు పంచితే ఫొటో తీసి తమకు పంపాలని రాజీవ్ కుమార్ కోరారు.సెల్ ఫోన్ లొకేషన్ ను బట్టి 100 నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకుంటామని చెప్పారు. ధనబలం, కండబలం నియంత్రణ తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని తెలిపారు. సి`విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరిస్తామని వివరించారు. ఓటర్లు ఫేక్ న్యూస్ ను షేర్ చేయకూడదని అన్నారు. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంటుందని తెలిపారు.