997 లో అంతరిక్ష యానం చేసిన కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్‌ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. కల్పన అంటే సంస్కృతం లో అర్ధం ‘‘ఊహ’’. ఈమెకి ఆకాశంలో విహరించాలనే అభిరుచి, విమాన చోదకంలో మార్గదర్శక పైలట్‌ మరియు వ్యాపారవేత్త అయిన జే.ఆర్‌.డి.టాటా నుంచి వచ్చింది. రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడ ఆమెకు లభించింది. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్‌`17 కొలంబియా స్పేస్‌ షటిల్‌ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది. 2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. ‘‘భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్‌.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్‌ ఇంజనీరింగ్‌ ను కెరీర్‌ గా తీసుకున్నా’’ అని చెప్పారు. భారత మహిళలకు విూరిచ్చే సందేశమేమిటని అడిగితే….. ‘‘ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని విూరు మనఃస్ఫూర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటె ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,… దానిలో లీనమై అనుభవించాలి’’ అని చెప్పారు. కొలంబియా వ్యొమనౌక విపత్తు ఫిభ్రవరి 1, 2003 లో చనిపోయిన ఏడుగురి బృందం లో ఈమె కూడా ఒకరు. కల్పనా చావ్లా, భారత దేశం లో హర్యానా లోని కర్నాల్‌ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబం లో మార్చి17, 1962 లోపుట్టారు.తండ్రి బనారసీలాల్‌ చావ్లా .సోదరుడు సంజయ్‌ చావ్లా కమర్షియల్‌ పైలట్‌ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్పూర్తిని రగిలించాయి.పంజాబ్‌ ఇంజరీరింగ్‌ కాలేజీ లో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ ‘‘ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌’’ లో మాస్టర్‌ అఫ్‌ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్‌ లో ఉన్న టెక్సాస్‌ విశ్వవిద్యాలయం నుంచి 1984 లో పొందారు.1986 లో, చావ్లా రెండవ మాస్టర్‌ అఫ్‌ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ లో పిహెచ్‌ .డి ని బౌల్డెర్‌ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు.ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్‌`పియర్‌ హారిసన్‌ ను వివాహం చేసుకున్నారు. చావ్లా పోయింతర్వాత పంజాబ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ లోని ఆడపిల్లల హాస్టల్‌ కు కల్పనా చావ్లా అని పేరు పెట్టారు. నాసా ఒక సూపర్‌ కంప్యూటర్‌ ని కల్పనా కి అంకిత మిచ్చింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *