కడప: శక్రవారం మాజీ మంత్రి,స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి 5 వ వర్ధంతి. స్మారకొత్సవ,జ్ఞాపకార్ధ సభ కు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయారు. అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణ గా ఉన్నాడు. చెల్లెళ్ళ విూద ఎన్ని అభాండాలు వేసినా తట్టుకున్నాం. సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి,ధర్మ పోరాటానికి నేను అండగా ఉంటా. ఈ గడ్డ సాక్షిగా మాట ఇస్తున్న.సునీత వెనుక నేనున్నా. ఇది ఆస్తికోసం,అంతస్తు కోసం జరిగే పోరాటం కాదు.న్యాయం కోసం జరుగుతున్న పోరాటం. ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలను చీ కొట్టాలి. హంతుకుల పక్షాన నిలబడ్డ వారికి ఒక గుణపాఠం నేర్పాలి. నిజం గెలవాలని అన్నారు.
వైఎస్ వివేకా ఒక మంచి మనిషి. వివేకా ది అద్భుతమైన వ్యక్తిత్వం. అందరికీ సహాయపడే గుణం. నన్ను ఎత్తుకొని తిరిగిన వ్యక్తి మా చిన్నాన్న. సునీత నేను కలిసే పెరిగాం. చిన్నాన్న ఎప్పుడు చికాకు పడలేదు.కోపం రాదని అన్నారు. సహాయం అని అడిగితే వెంట పెట్టుకొని మరి తీసుకొని వెళ్ళే వాడు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉండేవాడు. చిన్నాన్న నన్ను ఆఖరి గా కలిశాడు. ఎంపీగా పోటీ చేయాలని అడిగాడు. నేను వద్దు అన్నా వినలేదు. నన్ను ఒప్పించుకొని మరి వెళ్ళాడు. చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లు గడిరచింది. ఇప్పటికీ చిన్నాన్న మరణం నమ్మలేని నిజం. క్రూరాతి క్రూరంగా హత్య చేశారు. దారుణంగా నరికి చంపారని అన్నారు. కేసు ముందడుగు పడలేదు. ఆన్న అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణ గా ఉన్నాడు. అందుకే ఇవ్వాళ్టి వరకు చిన్నాన్న విషయంలో న్యాయం జరగలేదని అన్నారు.