డెహ్రాడూన్‌, మార్చి 13: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ అమల్లోకి తీసుకొచ్చింది. మార్చి 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.సివిల్‌ కోడ్‌ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ చరిత్ర సృష్టించింది. గత నెలలో అసెంబ్లీలో ఈ బిల్‌ పాస్‌ అయింది. ఇప్పుడు ఆ బిల్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా ఇది చట్టరూపం దాల్చింది. ఫిబ్రవరి 7వ తేదీన వాయిస్‌ ఓట్‌ ద్వారా అసెంబ్లీలో పాస్‌ అయింది ఈ బిల్లు. దాదాపు రెండు రోజుల పాటు దీనిపై వాదోపవాదాలు జరిగాయి. అసెంబ్లీ సెలెక్ట్‌ కమిటీకి ఈ బిల్‌ని పంపించాలని, ఆ తరవాతే ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కానీ…పుష్కర్‌ సింగ్‌ ధామి సర్కార్‌ నేరుగా ప్రవేశపెట్టింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *