న్యూఢల్లీి, మార్చి 12:కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం ను నోటిఫై చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ ల నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఈ చట్టం అమలుపై బీజేపీ ప్రభుత్వంపై విపక్ష నేతలు ఎదురుదాడికి దిగారు. కొందరు ఈ చట్టం అమలుకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ఈ చట్టం అమలుపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ తాజాగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్ కేంద్ర నిర్ణయంపై మండిపడ్డారు. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. కాగా, 2014 డిసెంబర్ 31 కన్నా ముందు హింసకు గురై భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు.భారత పౌరసత్వ సవరణ చట్టం ` 2019 ఆమోద యోగ్యం కాదని తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం అధినేత దళపతి విజయ్ అన్నారు. ‘దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో దీన్ని అమలు చేయకూడదని కోరుతున్నా. ఈ అంశంపై ప్రభుత్వ నేతలు ప్రజలకు హావిూ ఇవ్వాలి.’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులో చట్టాన్ని అమలు చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.పౌరసత్వ సవరణ చట్టాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర నిర్ణయంపై మండిపడ్డారు. ప్రజలపై వివక్ష చూపే విధంగా ఉంటే తాను అడ్డుకుంటానని అన్నారు. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సున్నిత అంశమని, ఎన్నికల ముందు తాను అశాంతిని కోరుకోవడం లేదని వెల్లడిరచారు. నిబంధనలు పరిశీలించిన అనంతరమే ఈ అంశంపై పూర్తిగా మాట్లాడుతానని పేర్కొన్నారు.పౌరసత్వ సవరణ చట్టం మతాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం ముస్లింలను రెండో స్థాయి పౌరులుగా మారుస్తాయని.. దీన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని స్పష్టం చేశారు. మతాల మధ్య విభజనకు వ్యతిరేకంగా కేరళ నిలబడుతుందని చెప్పారు.కాగా, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లపై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాని దృష్టి మరల్చేందుకే సీఏఏ ప్రకటన చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. ‘సీఏఏ చట్టం ఆమోదం పొందిన తర్వాత నిబంధనల రూపకల్పనకే మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల 3 నెలల సమయం తీసుకుంది. సరిగ్గా ఎన్నికల ముందు ఓట్లను చీల్చేలా ప్రణాళిక రచించి ఇప్పుడు తీసుకువచ్చింది. ముఖ్యంగా బెంగాల్, అసోంలో ఓట్లను చీల్చేలా ఈ సమయాన్ని ఎంపిక చేసింది.’ అని పేర్కొన్నారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండిరగ్ పెట్టారని, ఎన్నికల ముందే ఎందుకు అమలు చేస్తున్నారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కోరారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్ఫీఆర్ తెచ్చారని ఆరోపించారు. సీఏఏపై తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని వెల్లడిరచారు.