ప్రధాని మోదీ, యుపి సిఎం యోగీ ఆదిత్యనాథ్‌ను చంపుతాం
ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌.. మహమ్మద్‌ రసూల్‌ అనే వ్యక్తి ఎఫ్‌ఐఆర్‌
అతనికోసం గాలింపు.. హైదరబాద్‌ పోలీసులకు కూడా సమాచారం
బెంగళూరు మార్చ్‌ 5: ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను చంపూతామంటూ బెదిరించిన వ్యక్తిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదుచేశారు. యాద్గిర్‌ జిల్లాకు చెందిన మహమ్మద్‌ రసూల్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని, యూపీ సీఎంలను చంపుతానంటూ బెదిరిస్తూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. దీంతో అసభ్యకరమైన పదజాలంతో దూశించారు.కాగా, ఆ వీడియోకు సంబంధించి స్థానికుడు యాద్గిర్‌ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహమ్మద్‌ రసూల్‌పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ప్రస్తుతం అతనికోసం గాలిస్తున్నారు. హైదరబాద్‌ పోలీసులకు కూడా సమాచారం అందించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *