అమరావతి మార్చ్ 1: ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఫిబ్రవరి 1 న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీ నీటి వాటా కింద నీటిని విడుదల చేశారు.ఈ మేరకు కృష్ణా బోర్డు చెందిన అధికారులు సాగర్ కుడి కాలువ హెడ్‌రెగ్యులేడర్ నుంచి రెండు రాష్ట్రాల ఇంజినీర్ల సమక్షంలో విడుదల ప్రారంభించారు. రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 3 టీఎంసీల నీటిని 9 రోజుల పాటు విడుదల చేయనున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలో తాగునీటి అవసరాలకు నీటిని వినియోగించనున్నారు.