యంపి, యంయల్ ఏ అభ్యర్థుల చేతులమీదుగా అన్నదానం
🌸ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పార్థనలు*

🌸యంపి, యంయల్ ఏ అభ్యర్థుల చేతులమీదుగా అన్నదానం*

రాయచోటి  : అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణం, బండ్లపెంటలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ యూసుఫ్ షా ఖాదిరి దివానే సాహెబ్ పెద్ద దర్గా 66 వ ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉరుసు ఉత్సవాలలో భాగంగా గంథం సందర్భంగా దర్గా కమిటీ పెద్దలు ఏర్పాటు చేసిన ఆన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి యంపి, యంయల్ ఏ అభ్యర్థులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, సుబ్రమణ్యంలు పాల్గొన్నారు. వీరిద్దరిని దర్గా కమిటీ ప్రెసిడెంట్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. గంధం సందర్భంగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి దివానే సాహెబ్ దర్గాలో చాదర్ ను సమర్పించి చదివింపులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ సంధర్భంగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి బండ్లపెంట దివానే సాహెబ్ దర్గా రాయచోటిలోనే కాక, ఇతర జిల్లాలలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉందని, భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా దివానే సాహెబ్ బాబా మహిమలు ఉన్నాయని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దివానే సాహెబ్ ఉరుసు ఉత్సవాలలో పాల్గొని మతసామరస్యాన్నిచాటి చెబుతున్నారని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో రాయచోటి హిందూ, మహమ్మదీయ సోదరులందరూ తనను తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, ప్రతి ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటానని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎల్లవేళలా తోడుంటానని ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో అభ్యర్థించారు. దర్గా కమిటీ ప్రెసిడెంట్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్ తో పాటు, పూల వ్యాపారి మదనీ, బాష, మాజీ సర్పంచ్ నాగేశ్వర నాయుడు, సగీర్, మస్తాన్, అష్రఫ్, షాహూల్, దర్గా షరీఫ్, ఇమ్రాన్, శివ, రమేష్, సాంబశివ రెడ్డి, కొండాలతో పాటు హిందూ, మహమ్మదీయ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *