లక్నో ఫిబ్రవరి 28: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అఖిలేష్‌ యాదవ్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ గురువారం ప్రశ్నించనున్నది.కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షావ్లిూ, కౌశాంబి, ఫతేపూర్‌, డియోరియా, సహరాన్‌పూర్‌, హవిూర్‌పూర్‌, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్‌ కేసులు నమోదయ్యాయి. 2012`2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్‌ సైట్‌లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్‌ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012` 2013 జూన్‌ మధ్య మైనింగ్‌ శాఖ నిర్వహించిన అఖిలేష్‌ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *