వినుకొండ:పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్‌ లోని అంబెడ్కర్‌ విగ్రహం వద్ద భర్త ప్రమాద భీమా కొరకు యువతి నిరసన దీక్ష చేపట్టడం పట్టణంలో చర్చకు దారితీసింది. ఈ ఘటనతో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భర్తను పోగొట్టుకున్న యువతిపై సంబందిత అధికారులు ఏ మాత్రం కనికరం చూపకుండా గత నాలుగు సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రభుత్వం అందజేయు భర్త యాక్సిడెంట్‌ చంద్రన్న భీమా(వై.యస్‌.ఆర్‌ భీమా) డబ్బులు సగం తీసుకుని సగం ప్రభుత్వ ఉద్యోగిjైున రాజశేఖర్‌ కు ఇవ్వాలని డి.ఆర్‌.డి.ఏ అధికారులు తేల్చి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వినుకొండలోని డా బి.ఆర్‌ అంబెడ్కర్‌ విగ్రహం ముందు బుధవారం నిరసనకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు పరిశీలిస్తే వినుకొండ పట్టణానికి చెందిన శ్రీరామ్‌ శాంతి నిరుపేద కుటుంబానికి చెందిన యస్‌.సి సామాజిక వర్గానికి చెందిన యువతి, గత ఐదు సంవత్సరాల క్రితం ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన గరనేపూడి మహేష్‌ బాబుతో వివాహం జరిగింది. డి.ఆర్‌.డి.ఏ అధికారులు చంద్రన్న పెండ్లి కానుక డబ్బు శ్రీరామ్‌ శాంతి అకౌంట్‌ లో జమ చేశారు. వాస్తవానికి ఆడపిల్ల తల్లిదండ్రులకు ప్రభుత్వం చంద్రన్న కళ్యాణ కానుక అందజేస్తారు. రాజశేఖర్‌ డి.ఆర్‌.డి.ఏ లో పనిచేస్తుండటంతో అధికారులను మేనేజ్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. వివాహం జరిగిన సంవత్సరం తరువాత ఈపూరు మండలం కొత్త నెల్లూరు సవిూపంలో శాంతి భర్త మహేష్‌ బాబు బైక్‌ యాక్సిడెంట్‌ లో బైక్‌ పై నుండీ పడి కుక్కలు కరవడం వల్ల మహేష్‌ బాబు మరణించాడు. ఈపూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్‌ బాబుకు చంద్రన్న భీమా అప్పటికే ఉన్నది. మహేష్‌ బాబు తండ్రి డి.ఆర్‌.డి.ఏ లో ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ తాను మహేష్‌ బాబు చంద్రన్న భీమాకు నామినిగా ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన కుటుంబ యాజమాని మరణిస్తే అతనిపై ఆధారపడి ఉన్న వారు ఇబ్బందులు పడకుండా వారికి ఆర్థిక సహాయం అందజేయడానికి ఈ భీమాను అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. చంద్రన్న భీమాలో ప్రభుత్వ ఉద్యోగిjైున తండ్రి నామినీ గా ఉన్నప్పటికి ప్రభుత్వం పేద బాధితుల కోసం కల్పించిన ఇన్సూరెన్స్‌ కాబట్టి మరణించిన వ్యక్తి భార్య బ్రతికి ఉన్నప్పుడు భార్యను ఇన్సూరెన్స్‌ పొందుటకు హక్కురాలిగా స్థానిక డి.ఆర్‌.డి.ఏ అధికారులు సిఫారసు చేయాలి.
శాంతి తనను నామినిగా చేర్చి న్యాయం చేయాలని భర్త మరణించిన తరువాత నామినీ గా తన పేరు చేర్చి భీమా ఇప్పించాలని డి.ఆర్‌.డి.ఏ స్థానిక, జిల్లా అధికారులను ప్రాధేయపడుతూ వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నది డి.ఆర్‌.డి.ఏ అధికారులు భాధితురాలైన శాంతి విన్నపాలు బుట్టదాఖలు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా అధికారులను వేడుకుంటూనే ఉన్నది మరణించిన వ్యక్తి పై ఆధారపడి ఉన్న భార్యకు ఇన్సూరెన్స్‌ పొందుటకు సిఫారసు చేయకుండా డి.ఆర్‌.డి.ఏ లో పనిచేస్తున్న రాజశేఖర్‌ కు ఇవ్వాలని డి.ఆర్‌.డి.ఏ స్థానిక అధికారులు ప్రలోభాలకు లొంగి సిఫారసు చేశారు. డి.ఆర్‌.డి.ఏ జిల్లా అధికారులు భాధితురాలైన శాంతి అభ్యర్ధనపై స్పందించలేదు సంబందిత అధికారులపై చర్యలు జిల్లా అధికారులు ఇప్పటికి తీసుకోలేదు. తన భర్త ఇన్సూరెన్స్‌ డబ్బు ప్రభుత్వ ఉద్యోగి పొందాలని, పల్నాడు జిల్లా డి.ఆర్‌.డి.ఏ కార్యాలయంలోని కొందరి ద్వారా ఫైల్‌ రీ ఓపెన్‌ చేసుకున్నాడని తెలుసుకున్న శాంతి గత డిసెంబర్‌ నెలలో రాష్ట్ర సెర్ప్‌ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదులు చేసి గ్రీవిన్స్‌ లో కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినా పల్నాడు జిల్లా డి.ఆర్‌.డి.ఏ అధికారులు న్యాయం చేయక పోవడంతో రెండు నెలల క్రితం డిసెంబరు నెలలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ ను స్వయంగా కలిసి తన బాధను తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్‌ శాంతి పేరు నామినిగా సెర్ప్‌ కార్యాలయానికి లేఖ పంపించాలని, రాజశేఖర్‌ కు కౌన్సిలింగ్‌ ఇవ్వాలని ఫోన్‌ లో పల్నాడు జిల్లా డి.ఆర్‌.డి.ఏ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. డి.ఆర్‌.డి.ఏ అధికారులు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు సహితం పట్టించుకోకుండా బాధితురాలితో బేరసారాలకు దిగుతూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పంచాయతీ పెడుతున్నట్లు బాధితురాలు వాపోతున్నది. ఇప్పటికి మూడు సార్లు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి పిలిపించి పంచాయతీ పెట్టినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా కూడా సమాచారం అడిగినా సమగ్ర సమాచారం ఇవ్వలేదని సమాచార హక్కు చట్టంపై డి.ఆర్‌.డి.ఏ అధికారులు కనీస అవగాహన కూడా లేకుండా అతి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మొదటి అప్పీలు కూడా చేసినట్లు తేలిపింది. ఈపూరు తహసీల్దార్‌ ఈఓఅ ప్యామిలీ మెంబర్‌ సర్టిఫికేట్‌ కూడా జారీ చేశారని ఐనా డి.ఆర్‌.డి.ఏ అధికారులు న్యాయం చేయడం లేదని, గర్నెపూడి రాజశేఖర్‌ నెలకు 40 వేలు ప్రభుత్వం నుండీ జీతం తీసుకుంటూ తన భార్య పేరున జగనన్న చేయూత, ఆసరా తదితర పేదలకు అందజేసే స్కీములలో 60 వేళకు పైగా అక్రమంగా ప్రభుత్వ డబ్బులు తీసుకున్నాడని తనకు న్యాయంగా రావలసిన ప్రభుత్వ భీమా డబ్బులు కూడా పొందాలని ప్రయత్నం చేస్తున్నాడని కొందరు డి.ఆర్‌.డి.ఏ అధికారులు ఇతని అక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారని అంబెడ్కర్‌ విగ్రహం ముందు నిరసనకు దిగింది. జిల్లా కలెక్టర్‌ చెప్పినా న్యాయం దక్కడం లేదని అంబెడ్కర్‌ విగ్రహం పాదాల వద్ద వినతి పత్రం పెట్టి దీక్ష చేపట్టింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *