విశాఖపట్నం:డెకాయ్ ఆపరేషన్ ద్వారా నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశాం. భాస్కర రాజు, మద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు ఫేక్ కరెన్సీ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని డీసీపీ 2 మేకా సత్తిబాబు వెల్లడిరచారు. భాస్కర రాజుకు అన్నవరం కి చెందిన గన్ని రాజు అనే వ్యక్తి తో కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడిరది. ఫేక్ కరెన్సీ వ్యవహారం చెప్పి మొదట కొంత మొత్తం మార్చి నమ్మించాడు. పూర్తి నమ్మకం కలిగిన తర్వాత మూడు కోట్ల విలువ చేసే నోట్లను 30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు కాకాని నగర్ వద్ద పట్టుబడ్డారు. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లు గా మారుతాయి. ఫేక్ కరెన్సీ నోట్ల కేసులో ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నం. మూడో ముద్దాయి గని రాజు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీరిద్దరి నుండి మూడు కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ, మూడు సెల్ ఫోన్లు, ఓ కార్, వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాం. వీరి వెనక ఎవరున్నారు ఎవరు చేయిస్తున్నారు అనేది గనిరాజుని అదుపులోకి తీసుకున్నాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం. 489 సెక్షన్ కింద కేసు నమోదు చేసామని అయన అన్నారు.